Tuesday 22 June 2021

మూతపడుతున్న డిఎడ్ కాలేజిలు

మూతపడుతున్న డిఎడ్ కాలేజిలు

మూతపడుతున్న డిఎడ్ కాలేజిలు - పాఠశాల విద్య కమిషన్కు సమాచారం రాష్ట్రంలో మొత్తం 770 డిఎడ్ కళాశాలల్లో 65వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి


మూతపడుతున్న డిఎడ్ కాలేజిలు


రాష్ట్రంలోని ప్రైవేట్ డిప్లొమా ఉపాధ్యాయ విద్య (డిఎడ్) కళాశాలలు మూసివేతకు చేరువయ్యాయి. గతంలో కళాశాల ఏర్పాటుకు రాష్ట్రప్రభుత్వం విచ్చలవిడిగా అనుమతులు ఇచ్చింది. ఇందుకు తగ్గట్టుగా విద్యార్థులు చేరడం లేదు. 




రాష్ట్రంలో మొత్తం 770 డిఎడ్ కళాశాలల్లో 65వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రతిఏటా డిసెట్కు 10వేల లోపు మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటే వీరిలో ఆరు వేల వరకు ఉత్తీర్ణత సాధిస్తున్నారు. దీంతో 50వేలకు పైగా సీట్లు మిగిలిపోతున్నాయి.

కొన్ని ప్రైవేట్ కళాశాలలు మేనేజ్మెంట్ కోటాలో ఇష్టానుసారం విద్యార్థులకు అడ్మిషన్లు ఇస్తున్నాయి. 2018-2020 విద్యా సంవత్సరంలో సుమారు 20వేల మంది విద్యార్థులకు ప్రైవేట్ కళాశాలలు జిఓ 30 నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్లు ఇచ్చాయి. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు.

వైసిపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వారికి పరీక్షలు రాసేందుకు అర్హత లేదని నిలిపివేసింది. అభ్యర్థులు కోర్టును ఆశ్రయించినా వారికి న్యాయం జరగలేదు. పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం ఫిబ్రవరిలో కళాశాల యాజమాన్యాలకు నోటీసులు అందించింది.

విద్యార్ధులు, అధ్యాపకుల హాజరు, ప్రాక్టికల్స్ నిర్వహణ, ఇతర వసతుల కల్పనలో కొన్ని కళాశాలలు అవకతవకలు పాల్పడ్డాయని కమిషన్ గుర్తించింది. జిఓ 30 ఉల్లంఘన, నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని గుర్తించింది. 770 కళాశాలల్లో 350 మాత్రమే వెరిఫికేషన్ కోసం కమిషన్ వద్దకు వచ్చాయి. మిగిలిన 420 కళాశాలలు హాజరు కాలేదు.

కళాశాలలపై బృందాలుగా ఏర్పడి రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు చేయాలని కమిషన్ నిర్ణయం తీసుకుంది. వీటిపై తుది కసరత్తు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి కమిషన్ ప్రతిపాదనలు పంపాలని నిర్ణయం తీసుకుంది. కొన్ని కళాశాలల్లో తనిఖీలు కూడా నిర్వహించింది. కరోనాతో ఈ తనిఖీలు ముందుకు సాగలేదు. వెరిఫికేషన్కు హాజరు కానీ సుమారు 250 కళాశాలలు మూసివేస్తామని కమిషన్కు సమాధానం చెప్పినట్లు సమాచారం. కరోనా పరిస్థితి కొంచెం కుదుటపడ్డ తరువాత వీటిపై నిర్ణయం తీసుకుంటామని కమిషన్ అధికారులు చెబుతున్నారు.

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.