21వ శతాబ్ది నైపుణ్యాల సాధన దిశగా బోధన - విద్యాశాఖ మంత్రి సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైమరీ టీచర్లకు దీక్ష పోర్టల్ ఆధ్వ ర్యంలో సోమవారం ఆన్లైన్ శిక్షణ తరగతులను మంత్రి ప్రారంభించారు
21వ శతాబ్ది నైపుణ్యాల సాధన దిశగా బోధన - విద్యాశాఖ మంత్రి
విద్యతోనే సమాజాభివృద్ధి సాధ్య మని, పేదరికాన్ని పారదోలేందుకు విద్యే సాధనమని ప్రభుత్వ ఉద్దేశమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆది మూలపు సురేష్ చెప్పారు. సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైమరీ టీచర్లకు దీక్ష పోర్టల్ ఆధ్వ ర్యంలో సోమవారం ఆన్లైన్ శిక్షణ తరగతులను మంత్రి ప్రారంభించారు.
సీబీ ఎస్ఈ విధానం అమలు జరగనున్న నేపథ్యంలో ఉపాధ్యాయులకు ఈ శిక్షణ ఉప యోగపడుతుందని మంత్రి చెప్పారు. బోధన విధానంలో మార్పు అనివార్యమ ని, కేవలం సమాచారం అందించడమే కాకుండా 21వ శతాబ్ది నైపుణ్యాల సాధన దిశగా బోధన సాగాలన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన జాతీయ విద్యావి ధానం-2020' మార్గదర్శకాల ఆధారంగా నూతన పాఠ్య పుస్తకాలు రూపొందిం చినట్టు చెప్పారు.
2019-20 విద్యా సంవత్సరంలో ఒకటి నుంచి ఆరు తరగతు లకు, 2020-21 విద్యా సంవత్సరంలో ఏడో తరగతికి నూతన పాఠ్య పుస్తకాలు రూపొందాయన్నారు. 'మన బడి, నాడు-నేడు', జగనన్న విద్యాకానుక, జగనన్న అమ్మఒడి వంటి కార్యక్రమాల ద్వారా పేద పిల్లల చదువుల కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి సురేష్ చెప్పారు.
కార్యక్రమంలో పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, పాఠశాల విద్య డైరెక్టర్ వాడ్రేవు చినవీరభద్రుడు, సమగ్ర శిక్ష ఎస్పీడీ కె.వెట్రిసెల్విలు మాట్లాడారు.
0 comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.