Monday 21 June 2021

కుంకుడు కాయలతో జుట్టు పెరుగుతుందా

కుంకుడు కాయలతో జుట్టు పెరుగుతుందా

కుంకుడు కాయలతో జుట్టు పెరుగుతుందా ఎన్ని షాంపూలను మార్చినా మార్పు రావడం లేదని ఆందోళన చెందుతున్నార కొన్ని ఆయుర్వేద చిట్కాలను ఉపయోగించి జుట్టును ఆరోగ్యకరంగా ఉంచుకోవచ్చు

కుంకుడు కాయలతో జుట్టు పెరుగుతుందా

మహిళలకు జుట్టు అంటే ఎంతో ప్రాణం. వారి అందం విషయంలో జుట్టుదే అగ్రభాగం. ప్రస్తుత యుగంలో జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవడానికి తగినంత సమయం దొరకడం లేదు. దీంతో షాంపూలు, కండీషనర్లు ఉపయోగించి కొందరు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఎన్ని షాంపూలను మార్చినా మార్పు రావడం లేదని ఆందోళన చెందుతున్నారు. కానీ మన పూర్వీకులు ఉపయోగించే కొన్ని ఆయుర్వేద చిట్కాలను ఉపయోగించి జుట్టును ఆరోగ్యకరంగా ఉంచుకోవచ్చు.




ప్రస్తుతం దుకాణాలలో లభించే షాంపూల కారణంగా జుట్టు పల్చబడటం, తరచుగా తలలో చుండ్రు, పేలు, చిన్న వయస్సులోనే తెల్ల జుట్టు వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. కాబట్టి మీరు సహజ ఆయుర్వేద పద్ధతిని అనుసరించవచ్చు. మీరు ఆయుర్వేద పద్ధతిని అనుసరించినప్పుడు ఇది మీ జుట్టును ఒత్తుగా, మృదువుగా చేస్తుంది. అంతేకాకుండా జుట్టు రాలడాన్ని నియంత్రించడం, జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడం ద్వారా తేమగా ఉంచుతుంది. ఈ ఆయుర్వేద హెయిర్ కేర్ మీ జుట్టు రాలడాన్ని నియంత్రించి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

అలోవెరా జెల్, మెంతులు 


కావాల్సిన పదార్థాలు:మెంతులు, అలోవెరా జెల్, విటమిన్ ఇ టాబ్లెట్లు


తయారుచేసే విధానం:


ముందుగా ఓ కప్పులో కడిగిన మెంతులను తీసుకుని అందులో నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టాలి. మరుసటి ఉదయాన్నే మరో కప్పులో చెంచా అలోవెరా జెల్ తీసుకుని చెంచాతో బాగా కలియతిప్పాలి. ఇందులో విటమిన్ ఇ టాబ్లెట్‌లోని మెడిసిన్‌ను వేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. మెంతులు నానబెట్టిన నీళ్లను కొద్దికొద్దిగా తీసుకుంటూ చిక్కటి ద్రావణంలా తయారుచేసుకోవాలి. 

అలోవెరా జెల్ మిశ్రమం చేతికి అతక్కుండా ఉండే వరకు ఈ మిశ్రమాన్ని బాగా చెంచాతో కలియతిప్పుకోవాలి. ఇప్పుడు ఈ ఆయుర్వేదిక్ ద్రావణాన్ని ఓ సీసాలో భద్రపరుచుకుని అవసరమైనప్పుడు జుట్టుకు పట్టించుకుని మర్దన చేసుకోవాలి. అరగంట తర్వాత జుట్టును శుభ్రం చేసుకుంటే.. మీ జుట్టు ఆరోగ్యవంతంగా ఉంటుంది.


కుంకుడు కాయలు


జుట్టు వేగంగా పెరిగేందుకు కుంకుడుకాయ ఉత్తమమైన మార్గం కుంకుడు కాయ, ఉసిరి కాయ ఈ రెండూ మీ జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో సహాయపడతాయి. ఒక గిన్నెలో నీరు పోసి కుంకుడుకాయలు, ఉసిరికాయలను రెండింటినీ వేసి, రాత్రిపూట నానబెట్టి, మరుసటి రోజు ఉదయం ఓవెన్‌లో ఉడకబెట్టండి. నీటిని బాగా ఉడకబెట్టండి, తర్వాత చల్లారబెట్టండి, బయటకు తీయండి, నెత్తిమీద ఒక గంట పాటు రుద్దండి, తరువాత వెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. ఈ స్నానం సమయంలో మీకు షాంపూ అవసరం ఉండదు. కుంకుడుకాయలకు మురికిని తొలగించే వచ్చే సహజ ధోరణి ఉంది. 

కాబట్టి మీరు షాంపూని ఉపయోగించాల్సి అవసరం ఉండదు. మీ జుట్టు రాలడాన్ని తగ్గించడానికి, జుట్టు మూలాలను బలోపేతం చేయడానికి కుంకుడు కాయ సహాయపడుతుంది. మీరు దీన్ని వారానికి ఒకసారి ఉపయోగించవచ్చు.

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.