Monday 21 June 2021

భోజనంతో పచ్చి ఉల్లిపాయ అబ్బో, ఎన్ని ప్రయోజనాలో చూడండి

భోజనంతో పచ్చి ఉల్లిపాయ అబ్బో, ఎన్ని ప్రయోజనాలో చూడండి

భోజనంతో పచ్చి ఉల్లిపాయ అబ్బో, ఎన్ని ప్రయోజనాలో చూడండి ఉల్లిపాయలను భోజనంతో కలిపి తీసుకుంటే చాలా మంచిదట. ఇటీవల లైఫ్‌స్టైల్ కోచ్ ల్యూక్ కౌటిన్హో తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఉల్లిగడ్డలను పచ్చిగా తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి వివరించారు.


భోజనంతో పచ్చి ఉల్లిపాయ అబ్బో, ఎన్ని ప్రయోజనాలో చూడండి


మన దేశంలో ఉల్లి లేనిదే ఏ వంటకం పూర్తికాదు. వంటల్లోనే కాకుండా పచ్చివి కూడా తినేస్తారు. కొంతమందికి ఉల్లిపాయలతో సలాడ్ చేసుకుని తినడం ఇష్టం. ఉల్లి నోటికి రుచినే కాకుండా ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది. అందుకే, మన పెద్దలు ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని అంటారు. ముఖ్యంగా పచ్చి ఉల్లిపాయలను భోజనంతో కలిపి తీసుకుంటే చాలా మంచిదట. ఇటీవల లైఫ్‌స్టైల్ కోచ్ ల్యూక్ కౌటిన్హో తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఉల్లిగడ్డలను పచ్చిగా తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి వివరించారు.




ఉల్లిపాయల్లో ఉండే క్వెర్సెటిన్ (quercetin) శరీరానికి చాలా మేలు చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచేందుకు సహాయపడుతుంది. కెర్సెటిన్ మంటను తగ్గించడానికి, అలెర్జీ లక్షణాలను తగ్గించడానికి, రక్తపోటును నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. పచ్చి ఉల్లిపాయను భోజనంతోపాటు తీసుకోవడం వల్ల ఇమ్యునిటీ పెంచుకోవచ్చని కౌటిన్హో సూచించార

క్వెర్సెటిన్ మాత్రమే కాకుండా ఉల్లిపాయల్లో విటమిన్ సి, బి, పొటాషియం కూడా ఉంటాయి. పొటాషియం రక్తపోటు సమస్యతో బాధపడుతున్నవారికి చాలా మంచిది. అధిక యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా ఉల్లిపాయలో పుష్కలంగా ఉన్నాయి. అంతే కాదు ఉల్లిపాయలు యాంటీ బాక్టీరియల్‌గా కూడా పనిచేస్తుంది. పలు అధ్యయనాల ప్రకారం, డయాబెటిస్ (మధుమేహం), ప్రీ-డయాబెటిస్ బాధితుల రక్తంలో చక్కెరను నియంత్రించడానికి ఉల్లిపాయలు సహాయపడతాయి. మీరు తీవ్రమైన ఎసిడిటీ లేదా "మీకు తీవ్రమైన 

ఆమ్లత్వం లేదా GERD (Gastroesophageal reflux disease) సమస్యలతో బాధపడుతుంటే మాత్రం ఉడికించిన ఉల్లిపాయను తీసుకోవడమే ఉత్తమం అని కౌటిన్హో పేర్కొన్నారు.


ఉల్లితో కలిగే మరిన్ని ప్రయోజనాలు ఇవే:


ఉల్లిపాయలో విటమిన్-C, విటమిన్ B6, కాల్షియం, ఫైబర్, ఐరన్, పొటాషియం, మాంగనీస్, పాస్ఫరసర్ ఉంటాయి.

ఉల్లిలోని పీచు పదార్థం జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది.

ఉల్లిపాయలోని సల్ఫర్ కాంపౌండ్లు బ్లడ్ షుగర్‌ను తగ్గిస్తాయి.

మూత్రశయ ఇన్ఫెక్షన్లు తగ్గించడానికి ఉల్లి మంచి ఔషదం.

ప్రొస్టేట్ గ్రంథి ఆరోగ్యం మెరుగుపడటానికి, బీపీ తగ్గిస్తుంది.

ఉల్లిపాయను తరచుగా తీసుకోవడం వల్ల మొటిమలు, చర్మ సంబంధ ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి.

క్యాన్సర్ కారకాలను అడ్డుకుంటుంది.

ముఖ్య గమనిక: ఈ సమాచారాన్ని కేవలం మీ అవగాహన కోసమే అందించాం. ఇది అర్హత కలిగిన వైద్యుల అభిప్రాయానికి ప్రత్యామ్నాయం కాదు. మరింత సమాచారం కోసం వైద్యులు లేదా ఆహార నిపుణులను సంప్రదించండి

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.