Tuesday 8 June 2021

జాతీయ Covid టీకా వ్యాక్సినేషన్‌ పంపిణీ విధానంపై నూతన మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం

జాతీయ Covid టీకా వ్యాక్సినేషన్‌ పంపిణీ విధానంపై నూతన మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం

జాతీయ Covid టీకా వ్యాక్సినేషన్‌ పంపిణీ విధానంపై  నూతన మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం| జనాభాను బట్టి రాష్ట్రాలకు టీకాలు వృథా ఎక్కువుంటే కేటాయింపుల్లో కోత నూతన మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం


జాతీయ Covid టీకా వ్యాక్సినేషన్‌ పంపిణీ విధానంపై  నూతన మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం


దిల్లీ: కేంద్రం అందించే ఉచిత టీకా డోసులను జనాభా, వ్యాధి తీవ్రత, కేసుల సంఖ్య ప్రాతిపదికన ఆయా రాష్ట్రాలకు కేటాయించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు జాతీయ వ్యాక్సినేషన్‌ విధానంపై మంగళవారం నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు, వ్యాక్సినేషన్‌ సమర్థంగా చేపడుతున్న రాష్ట్రాలకు కేటాయింపుల్లో అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపింది. 




టీకాల వృథా ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు కేటాయింపుల్లో కోత ఉండొచ్చని హెచ్చరించింది. టీకా లభ్యత సమాచారాన్ని ఎప్పటికప్పుడు కేంద్రానికి వెల్లడించాలని సూచించింది. ఈ నూతన మార్గదర్శకాలు జూన్‌ 21 నుంచి అమల్లోకి రానున్నాయి.


టీకా పంపిణీపై నూతన మార్గదర్శకాలు 


దేశంలో ఉత్పత్తి అయ్యే వ్యాక్సిన్లలో 75శాతం కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. ఈ టీకాలను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఉచితంగా పంపిణీ చేస్తున్నాం. వీటిని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ప్రాధాన్యత ఆధారంగా ప్రభుత్వ వ్యాక్సిన్‌ కేంద్రాల ద్వారా ప్రజలకు అందిస్తున్నాయి

టీకా పంపిణీలో ప్రాధాన్యత ఎలాగంటే 1. ఆరోగ్య కార్యకర్తలు 2. ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు 3. 45ఏళ్లు పైబడిన పౌరులు 4. రెండో డోసు వేయించుకోవాల్సిన వారు 5. 18ఏళ్ల పైబడినవారు

18 ఏళ్లు పైబడిన వారిలో ప్రాధాన్యత క్రమాన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలే సొంతంగా నిర్ణయించుకుని టీకా పంపిణీ షెడ్యూల్‌ చేపట్టాలి

కేంద్ర ప్రభుత్వం అందించే టీకా డోసుల్లో రాష్ట్రాల్లోని జనాభా, కేసుల సంఖ్య, వ్యాక్సినేషన్‌లో వృద్ధి వంటి అంశాలను ఆధారంగా చేసుకుని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేటాయిస్తాం. రాష్ట్రాల్లోని టీకా వృథా.. కేటాయింపులపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది

టీకా డోసుల గురించి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ముందస్తు సమాచారం ఇస్తాం. ఇదే విధంగా రాష్ట్రాలు కూడా ఆయా జిల్లాలు, వ్యాక్సిన్‌ కేంద్రాలకు ముందుగానే డోసుల వివరాలు పంపాలి. ప్రజలకు కూడా తెలియజేయాలి

దేశంలో వ్యాక్సిన్‌ ఉత్పత్తిని పెంచేందుకు టీకా తయారీదారులు తమ ఉత్పత్తిలో 25శాతం నేరుగా ప్రైవేటు ఆసుపత్రులకు విక్రయించుకునే వీలు కల్పించాం. ప్రైవేటు ఆసుపత్రులకు ఇచ్చే డోసుల ధరలకు తయారీదారులు ముందుగానే ప్రకటించాలి. టీకాలపై ఛార్జీలను కూడా వెల్లడించాలి. ఇక ప్రైవేటు ఆసుపత్రుల్లో వ్యాక్సిన్‌ ధరపై సేవా రుసుం గరిష్ఠంగా రూ.150 మాత్రమే తీసుకోవాలి. దీన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు పరిశీలించాలి

కొవిన్‌ నమోదుతో పాటు వ్యాక్సిన్‌ కేంద్రాల వద్ద ఆన్‌సైట్‌ రిజిస్ట్రేషన్‌ సదుపాయాన్ని కూడా అందుబాటులో ఉంచాలి.

కాల్‌ సెంటర్లు, కామన్‌ సర్వీసు సెంటర్ల ద్వారా టీకా ముందస్తు బుకింగ్‌ చేసుకునే సదుపాయాన్ని ప్రజలకు కల్పించాలి


విదేశాలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగార్థులు, క్రీడాకారులకు శుభవార్త. 


కొవిషీల్ టీకా మొదటి డోసు తీసుకుని విదేశాలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగార్థులు, క్రీడాకారులకు  రెండో డోసుకు 84 రోజులు ఆగక్కర్లేదు! మొదటి డోసు తీసుకుని 28 రోజులు పూర్తయితే చాలు ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నిబంధనలను సవరించింది.

న్యూఢిల్లీ, జూన్ 7: విదేశాలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగార్థులు, క్రీడాకారులకు శుభవార్త. ఇలాంటి వారు కొవిషీల్ రెండో డోసు తీసుకునేందుకు 84 రోజులు ఆగనక్కర్లేదు. మొదటి డోసు తీసుకుని 28 రోజులు పూర్తయితే చాలు రెండో డోసు టీకా వేయించుకోవచ్చు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నిబంధనలను సవరించింది. 

విద్య, ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లేవారు, టోక్యో ఒలింపిక్స్లో పాల్గొనేందుకు వెళ్లే వారికి 84 రోజులు కాకపోయినా కొవిషీల్డ్ రెండో డోసు టీకా ఇచ్చేందుకు అనుమతి ఇచ్చింది. కొవిన్ పోర్టల్ లోనూ మార్పులు చేస్తున్నట్లు తెలిపింది. అంతర్జాతీయ ప్రయాణాలకు సహేతుక కారణాలను చూపిన వారు కొవిషీల్డ్ రెండో డోసును 84 రోజుల కంటే ముందుగానే తీసుకునేందుకు సంబంధింత జిల్లా యంత్రాంగం అను మతి ఇస్తుందని వివరించింది. వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లో పాస్పోర్టు నంబ రును ముద్రిస్తారని వివరించింది. మార్గదర్శకాలను తక్షణమే అమలు చేయాలని, ఇందుకు అవసరమైన ప్రచారాన్ని విస్తృతంగా చేయాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది.


0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.