Saturday 17 July 2021

అక్టోబర్ 1 నుంచి నూతన విద్యా సంవత్సరం యూనివర్సిటీలకు యూజీసీ ఆదేశాలు

అక్టోబర్ 1నుంచి నూతన విద్యా సంవత్సరం యూనివర్సిటీలకు యూజీసీ ఆదేశాలు

అక్టోబర్ 1 నుంచి నూతన విద్యా సంవత్సరం యూనివర్సిటీలకు యూజీసీ ఆదేశాలు అక్టోబరు ఒకటి నుంచి అకాడమిక్ సెషన్ ప్రారంభించాల్సి వుంటుంది.


అక్టోబర్ 1 నుంచి నూతన విద్యా సంవత్సరం యూనివర్సిటీలకు యూజీసీ ఆదేశాలు



న్యూఢిల్లీ: దేశంలో అన్ని యూనివర్శిటీలు, కాలేజీలకు ఎగ్జామినేషన్, అకాడమిక్ క్యాలెండర్‌కు సంబంధించిన గైడ్‌లైన్స్‌ను యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) విడుదల చేసింది.





కరోనా ముప్పు కారణంగా గత విద్యా సంవత్సరం అస్తవ్యస్తంగా సాగింది. పరీక్షలు కూడా సమయానికి జరగలేదు దీంతో యూజీసీ ప్రస్తుత విద్యా సంవత్సరాన్ని గాడిలో పెట్టేందుకు అన్ని యూనివర్శిటీలకు మార్గదర్శకాలను విడుదల చేసింది.

యూజీసీ ఆదేశాల ప్రకారం 2021- 22 విద్యా సంవత్సరంలో ఫస్ట్ ఇయర్ కోర్సులలో ప్రవేశాలను సెప్టెంబరు 30 నాటికి పూర్తి చేయాల్సివుంటుంది.

అక్టోబరు ఒకటి నుంచి అకాడమిక్ సెషన్ ప్రారంభించాల్సి వుంటుంది.

పరీక్షలను ఆన్ లైన్, ఆఫ్‌లైన్, మిశ్రమ విధానాల్లో నిర్వహించాల్సివుంటుంది

కాగా యూజీసీ కోర్సులలో అడ్మిషన్ కోసం 12వ తరగతి బోర్టు పరీక్షా ఫలితాలు వెల్లడి కావాల్సి వుంటుంది.

ఈ ఫలితాలు జూలై 31 నాటికల్లా విడుదల కానున్నాయి.

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.