Friday 9 July 2021

డెబిట్,క్రెడిట్ కార్డ్ ఉంటే రూ.10 లక్షల ఉచిత ఇన్సూరెన్స్ ఉన్నట్లే

డెబిట్,క్రెడిట్ కార్డ్ ఉంటే రూ.10 లక్షల ఉచిత ఇన్సూరెన్స్ ఉన్నట్లే డెబిట్, క్రెడిట్ కార్డులు కాంప్లిమెంటరీ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవరేజీతో 10

డెబిట్,క్రెడిట్ కార్డ్ ఉంటే రూ.10 లక్షల ఉచిత ఇన్సూరెన్స్ ఉన్నట్లే డెబిట్, క్రెడిట్ కార్డులు కాంప్లిమెంటరీ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవరేజీతో 10 లక్షల ఉచిత ఇన్సూరెన్స్ బ్యాంకు జారీ చేసిన అన్ని డెబిట్, క్రెడిట్ కార్డ్ వేరియెంట్లు బీమా కవరేజీ అందిస్తాయని ఆయన తెలిపారు. ఖాతాదారులు ప్రమాదవశాత్తు మరణించిన, శాశ్వత సంపూర్ణ వైకల్యం చెందిన బీమా అందిస్తారు - చెన్నైకి చెందిన ఇండియన్ బ్యాంక్ సీనియర్ అధికారి 


డెబిట్,క్రెడిట్ కార్డ్ ఉంటే రూ.10 లక్షల ఉచిత ఇన్సూరెన్స్ ఉన్నట్లే


బ్యాంకులు జారీ చేసే డెబిట్, క్రెడిట్ కార్డులు కాంప్లిమెంటరీ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవరేజీతో వస్తాయి. దీని గురించి చాలా మంది ఖాతాదారులకు తెలియదు. రూపే కార్డు డెబిట్ కార్డు ఖాతాదారులకు బ్యాంకు బీమా కవరేజీని అందిస్తుందని చెన్నైకి చెందిన ఇండియన్ బ్యాంక్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. 




బ్యాంకు జారీ చేసిన అన్ని డెబిట్, క్రెడిట్ కార్డ్ వేరియెంట్లు బీమా కవరేజీ అందిస్తాయని ఆయన తెలిపారు. ఖాతాదారులు ప్రమాదవశాత్తు మరణించిన, శాశ్వత సంపూర్ణ వైకల్యం చెందిన బీమా అందిస్తారు.

డెబిట్, క్రెడిట్ కార్డు లను బట్టి బీమా కవరేజీ ₹50,000 నుంచి ₹10 లక్షల వరకు లభిస్తుంది అని ఇండియన్ బ్యాంక్ అధికారి తెలిపారు.

అనుకోకుండా జరిగే ప్రమాదాల వల్ల ఖాతాదారుడు మరణిస్తే లేదా శాశ్వత సంపూర్ణ వైకల్యం చెందితే బీమా కవరేజీ లభిస్తుందని తెలిపారు. ఉద్దేశ్యపూర్వకంగా లేదా స్వయంకృతాపరాధం వల్ల జరిగిన ప్రమాదాలకు కాదు అని ఆయన అన్నారు. బీమా కవరేజీ బ్యాంకుతో వినియోగదారులకు ఉన్న సంబంధంపై ఆధారపడి బీమా కవరేజీ ₹2 లక్షల నుంచి ప్రారంభమై డెబిట్, క్రెడిట్ కార్డులు రెండింటికీ ₹10 లక్షల వరకు లభిస్తుందని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ వర్గాలు తెలిపాయి.


కార్డులు వాడుతూ ఉండాలి


ఇటువంటి సదుపాయాల గురించి వినియోగదారులకు అవగాహన లేదని, ఖాతాదారులకు తెలియజేయడం బ్యాంకుల విధి అని వినియోగదారుల ఫోరం యాక్టివిస్ట్ శ్రీ సదాగోపన్ అన్నారు. బీమాక్లెయిం చేసుకోవడానికి ఒక షరతు ఉన్న ఏమిటంటే? కార్డు యాక్టివ్ యూజ్ లో ఉండాలి. క్లెయింలను నిర్ధిష్ట కాలవ్యవధిలో మాత్రమే చేయాలి. 

ఉదాహరణకు, రూపే బీమా కార్యక్రమం కింద ప్రమాదం జరిగిన తేదీ నుంచి 90 రోజుల్లోగా క్లెయిం కోసం సమాచారం అందించాలి. అలాగే క్లెయింకు సంబంధించిన అన్ని సపోర్టింగ్ డాక్యుమెంట్ లను సమాచారం ఇచ్చిన తేదీ నుంచి 60 రోజుల్లోగా సబ్మిట్ చేయాలి. 

ప్రమాదం జరిగిన తేదీకి 90 రోజుల ముందు కార్డుదారుడు ఏదైనా లావాదేవీ(ఆర్థిక లేదా ఆర్థికేతర లావాదేవీ) చేయాల్సి ఉంటుంది. కస్టమర్లకు అందించే బీమా రకం, బీమా క్లెయిం ప్రక్రియ గురించి బ్యాంకులను ఏడాదికి ఒకసారి ఆడిట్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.