Tuesday 13 July 2021

నేటి నుండి మాస్క్ లేకుంటే ఖచ్చితంగా 100 ఫైన్

నేటి నుండి మాస్క్ లేకుంటే ఖచ్చితంగా 100 ఫైన్ దుకాణాలో సిబ్బంది నుంచి వినియోగదారుల వరకూ మాస్క్ తప్పనిసరి ఉల్లంఘనలకు పాల్పడితే భారీ జరిమానా అన్ని జిల్లా

నేటి నుండి మాస్క్ లేకుంటే ఖచ్చితంగా 100 ఫైన్ దుకాణాలో సిబ్బంది నుంచి వినియోగదారుల వరకూ మాస్క్ తప్పనిసరి ఉల్లంఘనలకు పాల్పడితే భారీ జరిమానా అన్ని జిల్లాల్లో ఒకేలా కర్ఫ్యూ


నేటి నుండి మాస్క్ లేకుంటే ఖచ్చితంగా 100 ఫైన్ దుకాణాలో సిబ్బంది నుంచి వినియోగదారుల వరకూ మాస్క్ తప్పనిసరి


రాష్ట్రం లో కోవిడ్ మహమ్మారి క్రమంగా తగ్గుముఖం పడుతుండటంతో వైరస్ నియంత్రణ చర్యను కఠినంగా అమలు చేయాలని, అదే క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఒకేలా కర్ప్యూ సడలిం పులు ఇవ్వాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. 




తాడే పల్లిలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం కోవిడ్-19 నియంత్రణ, నివారణ, వాక్సినేషన్పై సమీక్ష నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ సడలింపు ఉంటుందని, రాత్రి 9 తర్వాత దుకాణాలు మూసివేయాలని చెప్పారు. రాత్రి 10 గంటల తర్వాత నుండి ఉదయం 6 గంటల వరకూ కర్ఫ్యూ కర్ఫ్యూ ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా రోజువారీ పాజిటివిటీ రేటు 5 శాతం లోపల ఉందని, అందుకనే సడలింపులు ఇచ్చామని తెలిపారు.


లక్షణాలుంటే కోవిడ్ పరీక్ష


పీవర్ సర్వే అనంతరం ఫోకస్టుగా కోవిడ్ పరీక్షలు, చేయాలన్నారు. ఎవరికైతే జ్వరం ఇతర లక్షణా లుంటాయో వారికే పరీక్షలు చేయాలని సూచించారు. అదే సమయంలో వారికి తగినమందులు అందించాలని చెప్పారు. కేసులు సంఖ్యను ఎప్పటికప్పుడు పరిశీలన చేయడం ద్వారా వెంటనే తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెట్టాలని సూచించారు.

ఆగష్టు చివరికల్లా ఆక్సిజన్ ప్లాంట్లు రాష్ట్ర వ్యాప్తంగా 17 చోట్ల ఏర్పాటవుతున్న 134 పీఎస్ఎ ప్లాంట్లు (ఆక్సిజన్ ప్లాంట్లు) ఆగష్టు నెలాఖరు నాటికి పూర్తవుతాయని అధికారులు సీఎం జగన్ కు వివరించారు. 50 పడకలు దాటి ఉన్న ప్రతి ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లు ఉండాలన్న దానిపై పురోగతిని అడిగి తెలుసు కున్నారు. జిల్లా కలెక్టర్లు సంబంధిత జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రులకు ఈమేరకు ఆదేశాలు ఇచ్చారని అధికారులు తెలిపారు. ప్రభుత్వం వైపు నుంచి కూడా ఆదేశాలు ఇచ్చామన్నారు. దీనిపై మరింత దృష్టి సారిం చాలని, ఎప్పటికప్పుడు సమీక్ష చేయాలని సీఎం ఆదేశించారు.


ఉపాధ్యాయులకు వాక్సినేషన్


స్కూళ్లు తెరిచేముందు ఉపాధ్యాయులందరికీ వాక్సినేషన్ పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశం. చారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల టీచర్లు అందరికీ వాక్సినేషన్ పూర్తికావాలన్నారు. అందుబాటులో ఉన్న వాక్సిన్ నిల్వలను బట్టి. డిగ్రీ విద్యార్థులకు వాక్సినేషన్ కార్యక్రమం చేపట్టాలని చెప్పారు. ఆయా కాలేజీల్లోనే క్యాంపులు పెట్టి వాక్సిన్ వేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు.


కోవిజేతర వ్యాధులు అప్రమత్తం


ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో కోవిడేతర వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పీహెచ్సీల వారీగా సమీక్ష చేసి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. పామ కాట్లు పెరిగే అవకాశాలున్నాయన్న ఆయన మచిలీపట్నం, అవనిగడ్డ ప్రాంతాల్లో పాముకాట్లు ఎక్కువగా ఉంటాయని, వాటికి సంబంధించి ఇంజక్షన్లు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో డెంగ్యూ వంటి వ్యాధులు వర్షాకాలంలో ప్రబలే అవకాశం ఉందని, వాటికి సంబంధించిన మందులు పీహెన్నీ ల్లో, సీహెబీసీల్లో అందుబాటులో ఉన్నాయో లేదా చూసుకోవాలన్నారు. 


థర్డ్ వేవ్ సన్నద్ధత


థర్డ్ వేవ్ వస్తుందన్న సమాచారం నేపధ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. చిన్నపిల్లల వైద్యుల నియామకం, ప్రభుత్వ ఆస్పత్రం లో సన్నద్ధతపై పూర్తి స్థాయి సమీక్ష చేసుకోవాలని, మందులు కూడా సిద్ధంగా ఉండాలని చెప్పారు.

ఈ సమీక్షా సమావేశంలో ఉపముఖ్యమంత్రి (వైద్య, ఆరోగ్యశా) అళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్(నాని), పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతం సవాంగ్, కోవిడ్ కమాండ్ కంట్రోల్ ఛైర్మన్ డాక్టర్ కె.ఎస్ జవహర్ రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి (కోవిడ్ మేనేజిమెంట్ అండ్ వాక్సినేషన్) ఎం రవిచంద్ర, 104 కాల్ సెంటర్ ఇంచార్జి ఎ బాబు, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్, ఆరోగ్యశ్రీ సీఈఓ డాక్టర్ ఎ మల్లికార్జున, ఏపీఎండీసీ వీసీ అండ్ ఎండీ ది విజయరా మరాజు, హిల్త్ యూనివర్సిటీ వీసీ శ్యామ ప్రసాద్ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.



ఫోటో తీసి పంపిస్తే చాలు జరిమానా



కోవిడ్ వైరస్ తగ్గుముఖం పడుతున్న క్రమం లో మళ్లీ ఈ మహమ్మారి నిబృంభించకుండా ఉంటాలంటే కోవిడ్ నియంత్రణ చర్యలు మరింత కఠినతరం చేయాలన్నారు. ఈ సంద ర్భంగా ఆయన కొన్ని కీలకమైన సూచనలు చేశారు. ప్రతి ఒక్కరికి మాస్క్, భౌతిక దూరం తప్పనిసరి చేయాలని ఆదేశించారు. మాస్క్ ధరించకపోతే రూ. 100 జరిమానా కచ్చితంగా అమలు చేయాలని స్పష్టంచేశారు. 

దుకాణాల్లో యజమాని నుంచి వినియోగదారుల వరకూ ప్రతి ఒక్కరూ మాస్క్ తప్పనిసరిగా దరించాల్సిందే అని పేర్కొన్నారు. ఒకవేళ ఎవరయినా దుకాణాలకు భారీ జరిమానా విధించాలని ఉంఘించిన దుకాణాలను 2-3 రోజులపాటు "మూసివేతకూ వెనుకాడవద్దని స్పష్టంచేశారు. ఉల్లంఘనకు పాల్పడ్డారని ఎవరైనా ఫోటో తీసి పంపినా జరిమానాలు విధించాలని, అందుకోసం ప్రత్యేక వాట్సప్ నంబరు కేటాయించాలన్నారు. కర్స్యూ సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా కఠినంగా 144 సెక్షన్ అమలు జరగలన్నారు. ప్రజలె వ్వరూ గుమిగూ డకుండా కఠినంగా ఆంక్షలు విధించాలన్నారు. మార్కెట్లు తదితర బహిరంగ ప్రదేశాల్లో కవాడా మాస్క్లు తప్ప నిసరిగా ధరించేలా చూడాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.



రాష్ట్రంలో పరిస్థితి ఇది



పాజిటివిటీ రేటు 2.81 శాతం

3 శాతం కంటే పాజిటివిటీ రేటు తక్కువగా ఉన్న జిల్లాలు యాక్టివ్ కేసులు : 28,680 

ఆస్పత్రుల్లో ఉన్నవారు 5,005 

కోవిడ్ కేర్ సెంటర్లలో 4.97 రికవరీ రేటు 97,83 శాతం 

బ్లాక్ ఫంగస్  కేసులు 3976 

చికిత్స పొందుతున్నవారు 1052 మంది



మరింత తగ్గిన యాక్టివ్ కేసులు 



ఎట్టకేలకు రాష్ట్రంలో కరోనా వైరస్ తగ్గు ముఖం పట్టింది. రోజు రోజుకూ కరోనా పాణి టివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఆంక్షల సడలిం పులపై దృష్టి సారించింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోను ఒకే సమయంలో కర్ఫ్యూ విధిస్తూ వైద్య ఆరోగ్యశాఖ తాజాగా ప్రకటన చేసింది. మ రోవైపు డిశ్చార్డుల సంఖ్య మెరుగ్గా ఉం డటంతో యాక్టివ్ కేసులు 28 వేల కన్నా దిగువకు వచ్చాయి. కొత్త కేసులు 1578

రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 62 వేల 857 నమూనాలు సేకరించి పరీక్షించగా 1,578 కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనాతో చికి త్స పొందుతూ 22 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ప్రస్తుతం 27 వేల 185 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ సోమ వారం విడుదల చేసిన బులిటెన్ లో తెలిపింది. జిల్లాల వారీగా నమోదైన కోవిడ్ పాజిటివ్ కేసులను పరిశీలిస్తే.. అత్యధికంగా తూర్పు గోదావరిలో 305, అత్యల్పంగా శ్రీకాకుళంలో 31 కేసులు నమోదయ్యాయి.

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.