Wednesday 28 July 2021

నూతన విద్యావిధానం అమల్లో భాగంగా తొలివిడత 1,460 పాఠశాలల్లో NEP అమలు

నూతన విద్యావిధానం అమల్లో భాగంగా తొలివిడత 1,460 పాఠశాలల్లో NEP అమలు

నూతన విద్యావిధానం అమల్లో భాగంగా తొలివిడత 1,460 పాఠశాలల్లో  NEP అమలు సబ్జెక్టు ఉపాధ్యాయులతో బోధన 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో కలపనున్నారు ఉన్నత పాఠశాలలకు 250మీటర్ల దూరంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలన్నింటినీ విలీనం చేయాలని నిర్ణయించారు


నూతన విద్యావిధానం అమల్లో భాగంగా తొలివిడత 1,460 పాఠశాలల్లో  NEP అమలు


జాతీయ. విద్యా విధానం (ఎన్ఈపీ) అమలులో భాగంగా ఈ ఏడాది ఒకే ప్రాంగణంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలతోపాటు పక్కనే ఉండే బడులలో నుంచి 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో కలపనున్నారు. ఈ విద్యా సంవత్సరంలో దీన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. 




ఎన్ఎస్ఈపీ అమలుకు తీసుకోవాల్సిన చర్యలపై రెండు రోజులపాటు నిర్వహించనున్న కార్యశాలను పాఠశాల విద్యాశాఖ మంగళవారం ప్రారంభించింది. జిల్లా విద్యాధికారులు, ప్రాంతీయ సంయుక్త సంచాలకులు ఇందులో పాల్గొన్నారు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నత, ప్రాథమిక పాఠశాలలు ఒకే ప్రాంగణంలో 39 ఉండగా పక్కపక్కనే 521 ఉన్నాయి మొదటి విడతగా వీటిల్లో అమలు చేయనున్నారు జిల్లాలవారీగా ఉన్నత, ప్రాథమిక పాఠశాలలు, అంగన్వాడీలకు మధ్య ఉన్న దూరానికి సంబంధించిన వివరాలను సేకరించారు.


సబ్జెక్టు ఉపాధ్యాయులతో బోధన


ఉన్నత పాఠశాలల్లో 3-10 వరకు సబ్జెక్టు ఉపాధ్యా యులతో పాఠాలు చెప్పిస్తారు. స్కూల్ అసి స్టెంట్లు(ఎస్ఏ) తక్కువగా ఉన్నచోట సమీపంలోని పాఠశాల నుంచి డిప్యుటేషన్పై తీసుకోవాలని భావిస్తు న్నారు. ఇది సాధ్యంకాని సమయంలో అర్హత కలిగిన ఎస్జీటీలకు బోధన బాధ్యతలు అప్పగిస్తారు. ప్రాథమిక పాఠశాలల్లో మిగిలే 1, 2 తరగతులకు అంగన్వాడీ లను అనుసంధానం చేసి ఫౌండేషన్ బడులుగా మార్పు చేస్తారు. ఆ తర్వాత 250 మీటర్లలోపు దూరంలో ఉండే వాటిని పరిశీలిస్తారు ప్రయోగాత్మక అమలులో వచ్చే ఫలితాలు ఆధారంగా 2022-23 సంవ త్సరానికి నిర్ణయం తీసుకుంటారు..


ఆ పాఠశాలల విలీనం


తొలివిడతలో 250 మీటర్ల దూరమున్నవాటికి వర్తింపు మొత్తంగా 3 వేల బడులు అంచనా బడులు తెరిచేనాటికి కసరత్తు పూర్తి! నూతన విద్యావిధానం’లో అమలు ఆర్జేడీలతో విద్యాశాఖ సమీక్ష

నూతన విద్యావిధానం అమల్లో భాగంగా ఉన్నత పాఠశాలలకు 250మీటర్ల దూరంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలన్నింటినీ విలీనం చేయాలని నిర్ణయించారు. తొలుత హైస్కూలుకు కిలోమీటరు లోపున్న పాఠశాలలను హైస్కూల్‌లోనే విలీనం చేయాలన్న ప్రతిపాదన వచ్చింది. ఇలా చేస్తే సుమారు 10వేల పాఠశాలల్ని విలీనం చేయాల్సి ఉంటుంది. దీంతో ప్రభుత్వం కొంత ఆలోచన చేసి పావు కిలోమీటరు లోపున్న పాఠశాలలనే తొలి విడతలో విలీనం చేయాలని నిర్ణయించింది. ఈ రకంగా రాష్ట్రవ్యాప్తంగా 3వేల పాఠశాలలు విలీనం చేయాల్సి ఉంటుందని అంచనా. 

విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్‌ ఆధ్వర్యంలో విద్యాశాఖ ఆర్జేడీలు, డీఈవోలతో మంగళవారం నూతన విద్యావిధానం అమలుపై చర్చించారు నూతన విద్యావిధానం అమల్లో భాగంగా ఆరు అంచెల్లో పాఠశాలలు ఏర్పాటు చేస్తారు ఆగస్టు 16 నాటికి అంటే పాఠశాలలు, కళాశాలలు తెరిచేనాటికి ఈ కసరత్తు పూర్తిచేయాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నిర్దేశించారు. 

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.