Thursday 8 July 2021

ఇంటర్‌ మార్కుల విధానం ఖరారు ఆగస్టు 15 తర్వాత బడులు పునఃప్రారంభం

ఇంటర్‌ మార్కుల విధానం ఖరారు ఆగస్టు 15 తర్వాత బడులు పునఃప్రారంభం 12నుంచే ఆన్‌లైన్‌ పాఠాలు ఉపాధ్యాయులకు టీకా ఒక్క పాఠశాలా మూసివేయొద్దు ఒక్క టీచర్‌నూ తొల

ఇంటర్‌ మార్కుల విధానం ఖరారు ఆగస్టు 15 తర్వాత బడులు పునఃప్రారంభం 12నుంచే ఆన్‌లైన్‌ పాఠాలు ఉపాధ్యాయులకు టీకా ఒక్క పాఠశాలా మూసివేయొద్దు ఒక్క టీచర్‌నూ తొలగించకూడదు నాడు-నేడు’ సమీక్షలో సీఎం జగన్‌


ఇంటర్‌ మార్కుల విధానం ఖరారు ఆగస్టు 15 తర్వాత బడులు పునఃప్రారంభం


ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం మార్కుల మదింపు విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. పదో తరగతిలో సైన్సు, గణితం, సాంఘిక శాస్త్రాల్లో వచ్చిన మార్కుల ఆధారంగా 30శాతం, ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో వచ్చిన మార్కులకు 70శాతం వెయిటేజీతో వంద శాతం మార్కులు కేటాయించనున్నట్లు సీఎం జగన్‌ ప్రకటించారు. 




ప్రయోగ పరీక్షలు పూర్తయినందున వాటి ఫలితాల ఆధారంగా ప్రాక్టికల్‌ మార్కులు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. విద్యాశాఖలో ‘నాడు-నేడు’, జగనన్న విద్యాకానుకలపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షించారు.

మంత్రులు ఆదిమూలపు సురేష్‌, తానేటి వనిత, విద్యా శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. విద్యా కానుక కింద అందించనున్న ఆక్స్‌ఫర్డ్‌ నిఘంటువును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘నూతన జాతీయ విద్యా విధానంతో ఉపాధ్యాయులు, పిల్లలకు మేలు జరుగుతుంది. సబ్జెక్టుపై పట్టున్న ఉపాధ్యాయుల సేవలను సమర్థంగా వినియోగించుకోవాలి’ అని సూచించారు

ఉపాధ్యాయులకు టీకా ‘ఆగస్టు 15 తర్వాత పాఠశాలలు ప్రారంభించాలన్నది ఆలోచన. ఈలోపు ఉపాధ్యాయులకు టీకా వేసేందుకు కార్యాచరణ రూపొందించాలి.

జులై 15 నుంచి ఆగస్టు 15 వరకు వర్క్‌బుక్స్‌ ద్వారా పిల్లలకు బోధించాలి. విద్యాకానుకలో భాగంగా అందిస్తున్న పాఠ్యపుస్తకాలు, బ్యాగ్‌లు, ఏకరూప దుస్తులు, నోట్‌బుక్స్‌, బూట్లు, బెల్టులను సిద్ధం చేయాలి. వీటిని ఆగస్టులో అందించాలి’ అని సీఎం సూచించారు

వారంలో ప్రతిపాదనలు ‘విద్యార్థుల నిష్పత్తికి తగినట్లు ఉపాధ్యాయులు ఉండాలి. ఒక్క పాఠశాలా మూసివేయొద్దు. ఒక్క టీచర్‌నూ తొలగించకూడదు. నూతన విద్యావిధానంపై ఈ వారంలో ప్రతిపాదనలు ఖరారు చేయాలి.

నాడు-నేడు పనులు షెడ్యూలు ప్రకారం చేపట్టాలి. నిధుల విడుదల నుంచి పనుల వరకు అన్నీ నిర్ణీత సమయంలో జరగాలి’ అని జగన్‌ ఆదేశించారు

అధికారులు ఏమన్నారంటే ఆగస్టులో రెండో విడత నాడు-నేడు పనులు ప్రారంభించి, వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు సీఎంకు వెల్లడించారు.

జాతీయ విద్యా విధానం ప్రతిపాదనల ప్రకారం అంగన్‌వాడీ కేంద్రాలను మ్యాపింగ్‌ చేసినట్లు తెలిపారు. ‘విద్యా రంగంలో రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వ అధికారులు ప్రశంసించారు.

నూతన విద్యా విధానంపై ఇప్పటికే భాగస్వామ్య పక్షాలతో సమావేశమయ్యాం. దీనికి 34 సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. క్షేత్రస్థాయిలోనూ పర్యటించి ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులతో చర్చించాం. కృష్ణా జిల్లా ఎ.కొండూరు మండలంలో పర్యటించినప్పుడు అక్కడి ప్రధానోపాధ్యాయులు నూతన విద్యా విధానాన్ని స్వాగతించారు’ అని వివరించారు

ఆ బడిలో ఉన్నత విద్యకు వెళ్లలేదు : తాము పరిశీలించిన ఓ ప్రాథమిక పాఠశాలలో ఉన్నత విద్య వరకు వెళ్లిన వారు లేరని, ఒక విద్యార్థి సాంఘిక సంక్షేమ గురుకులానికి ఎంపిక కావడంతో ఇంజినీరింగ్‌ వరకు చదవగలిగాడని సీఎంకు అధికారులు ఉదాహరించారు. ఇద్దరు పిల్లలున్న ఓ తల్లి కేవలం ఆంగ్ల మాధ్యమం కోసమే తన కుమారుడిని 17 కి.మీ. దూరంలోని ప్రైవేటు బడికి పంపిస్తోందని ప్రస్తావించారు. ప్రభుత్వ బడుల్లో నాడు-నేడుతో ఈ పరిస్థితిలో మార్పు వస్తుందని వెల్లడించారు.

12నుంచే ఆన్‌లైన్‌ పాఠాలు: మంత్రి ఆదిమూలపు:

పాఠశాలల్లో ఈనెల 12(సోమవారం) నుంచి ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభమవుతాయని మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. ‘నాడు-నేడు’పై సీఎం జగన్‌ సమీక్ష అనంతరం మంత్రి విలేకర్లతో మాట్లాడుతూ ‘‘ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని తప్పనిసరిగా అమలు చేస్తుంది. ఈ విధానంతో ఏ పాఠశాల మూతపడదు’’ అని వెల్లడించారు

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.