Saturday 24 July 2021

ఈనెల 26న వెబ్‌సైట్‌లో ఇంటర్‌ సెకండియర్‌ షార్ట్‌ మార్కుల మెమోలు

ఈనెల 26న వెబ్‌సైట్‌లో ఇంటర్‌ సెకండియర్‌ షార్ట్‌ మార్కుల మెమోలు

ఈనెల 26న వెబ్‌సైట్‌లో ఇంటర్‌ సెకండియర్‌ షార్ట్‌ మార్కుల మెమోలు వివాద పరిష్కార కమిటీ ఏర్పాటు 2020 పదో తరగతి విద్యార్థులకూ మార్కులు  'పది’ గ్రేడ్లపై కసరత్తు మార్కుల జాబితాలు పూర్తి తప్పుల సవరణకు నేడు తుది గడువు


ఈనెల 26న వెబ్‌సైట్‌లో ఇంటర్‌ సెకండియర్‌ షార్ట్‌ మార్కుల మెమోలు 


ఇంటర్‌ సెకండియర్‌ మార్కుల షార్ట్‌ మెమోలను ఈనెల 26వ తేదీ సాయంత్రం నుంచి బోర్డు వెబ్‌సైట్‌  ‘bie.ap.gov.in’ లో పొందుపర్చనున్నారు. అనంతరం విద్యార్థులు తమ మార్కుల మెమోలను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇంకా ఏమైనా సందేహాలు, సమస్యలుంటే  ‘ourbieap@gmail.com’ మెయిల్‌కు లేదా 9391282578 నంబర్‌లోని వాట్సాప్‌కు మెసేజ్‌ ఇవ్వవచ్చని బోర్డు వివరించింది. 




మీడియా సమావేశంలో గౌ౹౹ పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి. రాజశేఖర్ గారు , ఇంటర్‌ బోర్డు కార్యదర్శి వి. రామకృష్ణ గారు, పరీక్షల నియంత్రణాధికారి రమేష్‌లు పాల్గొన్నారు.


వివాద పరిష్కార కమిటీ ఏర్పాటు


ఈ పరీక్ష ఫలితాలకు సంబంధించి సందేహాలు, ఇతర సమస్యలుంటే వాటిని నివృత్తి చేసి పరిష్కరించేందుకు వివాద పరిష్కార కమిటీని ఇంటర్మీడియెట్‌ బోర్డు ఏర్పాటుచేస్తోంది. అలాంటి వారు బోర్డు ఏర్పాటుచేసిన ‘bie.ap.gov.in’  వెబ్‌సైట్‌లో తమ సమస్యలను తెలియజేయవచ్చు.


2020 పదో తరగతి విద్యార్థులకూ మార్కులు


గతేడాది(2020) పదో తరగతి విద్యార్థులకూ మార్కులు ఇవ్వాలని నిర్ణయించారు. రెండేళ్లు పరీక్షలు నిర్వహించకుండానే పదోతరగతి విద్యార్థుల్ని ఉత్తీర్ణుల్ని చేశామని, కొన్ని ప్రవేశాల్లో మార్కులను పరిగణనలోకి తీసుకోవడంతో ఉద్యోగాల విషయంలో ఇబ్బంది పడుతున్నారని గౌ౹౹ సీఎం గారికి వివరించారు. పదో తరగతి పరీక్ష ఫలితాలను వారం రోజుల్లో విడుదల చేయనున్నారు. మూడు ఫార్మెటివ్‌ పరీక్షలు 50శాతం, సమ్మెటివ్‌ 50శాతం తీసుకొని వందశాతానికి మార్కులు కేటాయిస్తారు. ఈ ఏడాది 2020-21కు ఇప్పటికే ఫార్మెటివ్‌ పరీక్షలు రెండు నిర్వహించినందున వీటి ఆధారంగా మార్కులు కేటాయిస్తారు


 'పది’ గ్రేడ్లపై కసరత్తు మార్కుల జాబితాలు పూర్తి తప్పుల సవరణకు నేడు తుది గడువు


 పదో తరగతి విద్యార్థులకు మార్కులపై కసరత్తు కొలిక్కి వచ్చింది. కరోనా నేపథ్యంలో పరీక్షలు నిర్వహించకుండా పరీక్షలకు ఫీజు చెల్లించిన వారందర్నీ ఉత్తీర్ణులైనట్లు ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.

 ఇందులో భాగంగా విద్యార్థులకు గతంలో నిర్వహించిన ఫార్మెటివ్ అసెస్మెంట్ (ఎఫ్ఎ) 1,2 పరీక్షల్లో సాధించిన మార్కులను రాష్ట్ర విద్యాశాఖ వైబ్సైట్లో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఇటీవల నమోదు చేశారు.

 సిబిఎస్ఇ విద్యార్థులు మినహా రాష్ట్ర సిలబస్ లో చదివిన వారిలో పరీక్ష ఫీజు చెల్లించిన 58,353 మంది మార్కులను మదింపు చేశారు. అయితే 1200 మంది సిబిఎస్ఇ సిలబస్ విద్యార్థుల ఫలితాలను సిబిఎస్ఇ అధికారులు ప్రకటించాల్సిఉంది. రాష్ట్ర సిలబస్ లో చదివిన 58,353 మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు త్వరలో ప్రకటించున్నారు.

విద్యార్థులందరికీ మార్కులు, గ్రేడ్లు ఒకే విధంగా 2020-21 సంవత్సరంలో నిర్వహించిన ఎఫ్.ఎ.1, ఎఫ్.ఎ.2. పరీక్షల మార్కుల ఆధారంగా గ్రేడ్లు కేటాయించ నున్నారు. ఇందుకోసం 15 రోజులుగా అధికారులు పాఠశాలల నుంచి వివరాలు తెప్పించి ఆన్లైన్లో నమోదు చేశారు. ఆన్లైన్ లో మార్కుల నమోదు. పూర్తి కావడంతో గ్రేడ్ల కేటాయింపుపై దృష్టి పెట్టారు.. గ్రేడ్ కేటాయింపు పూర్తయ్యి మార్కుల జాబితాలను రూపొందించి ఫలితాల వెల్లడికి కసరత్తు జరుగు తోంది. పలు పాఠశాలల్లో మార్కుల నమోదులో తీవ్ర జాప్యమైంది. సాంకేతిక కారణాల వల్ల ఇబ్బంది. రావడంతో గౌ౹౹ జిల్లా విద్యాశాఖాధికారి వారు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి వీటి నమోదు ప్రక్రియను పూర్తి చేయించారు.


డిప్యూటీ డిఈవో సంతకంతో దాఖలు చేయాలి


జిల్లాలోని అన్ని పాఠశాలలకు చెందిన విద్యార్ధులకు సంబంధించి ఎఫ్.ఎ.1, ఎఫ్.ఎ.2. మార్కుల జాబితా నమోదులో తప్పులు దొర్లితే వెంటనే వీటిని గుర్తించి ఉప విద్యాశాఖ అధికారులు సంతకంతో ధ్రువీకరించి శనివారం సాయంత్రం 5 గంటల్లోగా తమ కార్యాలయంలో అందచేయాలని డీఐలు పేర్కొన్నారు. ఈ మేరకు సమాచారాన్ని ప్రధానోపాధ్యాయులకు శుక్రవారం అందించారు. 

తప్పులు దొర్లిన విద్యార్థులకు సంబంధించి వారు రాసిన ఆన్సర్ షీట్లు, మార్కుల ఎంట్రీ రిజిష్టరు డిప్యూటీ డీఈవోలకు  అందచేసి తప్పులుసరిచేయాలని కోరారు.

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.