Saturday 3 July 2021

కేజీబీవీల్లో 6,11 తరగతుల్లో ప్రవేశాలకు ఈ నెల 15 వరకు దరఖాస్తు గడువు పొడిగింపు

కేజీబీవీల్లో 6,11 తరగతుల్లో ప్రవేశాలకు ఈ నెల 15 వరకు దరఖాస్తు గడువు పొడిగింపు

కేజీబీవీల్లో 6,11 తరగతుల్లో ప్రవేశాలకు ఈ నెల 15 వరకు దరఖాస్తు గడువు పొడిగింపు - సమగ్ర శిక్ష ఎన్పీడీ కె.వెట్రిసెల్వి


కేజీబీవీల్లో 6,11 తరగతుల్లో ప్రవేశాలకు ఈ నెల 15 వరకు దరఖాస్తు గడువు పొడిగింపు


రాష్ట్రంలోని 352 కస్తూర్భాగాంధీ బాలికా విద్యాలయాల (కేజీబీవీ)లో 2021-22 విద్యా సంవత్సరానికి గాను 6, 11 తరగతుల్లో ప్రవేశానికి, 7, 8 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం దరఖాస్తు స్వీకరణ గడువును ఈ నెల 15 వరకు పొడిగించినట్లు సమగ్ర శిక్ష ఎన్పీడీ కె.వెట్రిసెల్వి ఒక ప్రక టనలో తెలిపారు. 




ఆన్లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులను మాత్రమే అడ్మిషన్ కోసం పరిగణిస్తామని పేర్కొన్నారు. దరఖాస్తులను https://apkgbv.a pcfss.in ద్వారా పొందాలన్నారు. కేజీబీవీల్లో పదో తరగతి చదివిన విద్యార్థినులు కూడా 11వ తరగ తిలో ప్రవేశానికి ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలన్నారు.


జూలై 15 వరకు ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ


రాష్ట్రా ప్రభుత్వ ఆధ్వ ర్యంలోని 352 కస్తూర్బా గాంధీ విద్యాలయాల లో 2021-22 విద్యా సంవత్సరానికి 6వ, 11వ తరగతుల్లో ప్రవేశం కోసం, అలాగే 7, 8 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం ఆన్లైన్ దరఖాస్తుకు గడువును జూలై 15 వరకు పొడి గించినట్లు సమగ్ర శిక్ష ఎస్పీడీ కె. వెట్రిసెల్వి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అనాథ లు, బడి మానేసిన పిల్లలు, పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, బీపీఎల్ పరిధిలోని బాలికలు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆన్ లైన్ దరఖాస్తులను మాత్రమే అనుమతిస్తామ న్నారు. 'హెచీటీపీఎస్://ఏపీకేజీబీవీ.ఏపీ సీఎఫ్ఎస్ఎస్.ఐఎన్' ద్వారా దరఖాస్తు చేసు కోవాలన్నారు.

కేజీబీవీల్లో పదో తరగతి చది విన విద్యార్థినులు కూడా 11వ తరగతిలో ప్ర వేశం కోసం దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ఎంపికైన విద్యార్థులకు ఫోన్ మెసేజ్ ద్వా రా సమాచారం అందిస్తామన్నారు. సమస్య లు, సందేహాల నివృత్తి కోసం 9494383617, 9441270099 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని పేర్కొన్నారు.

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.