Thursday 1 July 2021

ఎయిడెడ్ టీచర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ కోర్టు వ్యాజ్యాల పరిధిలోని స్కూళ్ల వరకు ఖాళీల భర్తీ

ఎయిడెడ్ టీచర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ కోర్టు వ్యాజ్యాల పరిధిలోని స్కూళ్ల వరకు ఖాళీల భర్తీ

ఎయిడెడ్ టీచర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ కోర్టు వ్యాజ్యాల పరిధిలోని స్కూళ్ల వరకు ఖాళీల భర్తీ


ఎయిడెడ్ టీచర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ కోర్టు వ్యాజ్యాల పరిధిలోని స్కూళ్ల వరకు ఖాళీల భర్తీ


రాష్ట్రంలోని ఎయిడెడ్ స్కూళ్లలో టీచర్ పోస్టుల భర్తీకి పాఠశాల విద్యాశాఖ గ్రీన్ సి గ్నల్ ఇచ్చింది. ఉన్నత న్యాయస్థానం ఆదేశాలను అనుసరించి కోర్టుకేసుల పరిధిలో ఉన్న ఎయిడెడ్ విద్యాసంస్థల్లోని టీచర్ పోస్టుల భర్తీకి వీలుగా చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల విద్యాధికారులు, ప్రాంతీయ సంచాలకులకు సూచించింది. 




1:40 వంతున టీచర్, విద్యార్థుల నిష్పత్తిని అనుసరించి ఖాళీలను భర్తీచేయాలని పేర్కొంది. ఆయా స్కూళ్లలోని ఎయిడెడ్ సెక్షన్లలో 2020-21 విద్యాసంవత్సరపు ఎన్రోల్మెంటును పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. 

ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశా ల 2021 ఏప్రిల్ 19, ఉన్నత పాఠశాలల్లో 2021 ఏప్రిల్ 30 నాటికి ఉన్న చేరికల సంఖ్యను అనుస రించి టీచర్ల సంఖ్యను నిర్ణయించాలని పేర్కొంది. 

ఇప్పటికే ఇందుకు సంబంధించిన ప్రొఫార్మాను జిల్లాలకు పంపి యూడైస్ డేటా ఆధారంగా ఆ సమాచారాన్ని క్రోడీకరించాలని ఆదేశించింది. 

టీచర్ల సీనియారిటీ, నిర్వహణలో లేని ఎయిడెడ్ స్కూ ళ్లలో మిగులు పోస్టులను తీసుకుని జిల్లా యూనిట్ గా కేటగిరీ వారీగా డేటాను సిద్ధం చేయాలని పేర్కొంది. విద్యార్థుల సంఖ్యను అనుసరించి ఏయే స్కూళ్లలో టీచర్ల నియామకం అవసరమో తేల్చాలని ఇంతకు ముందు ఉత్తర్వులు ఇచ్చింది. 

స్కూలు వారీగా విద్యార్థుల సంఖ్య, ఎయిడెడ్ పోస్టులు, పనిచేస్తున్న సిబ్బంది, ఖాళీలు, భర్తీచేయాల్సిన పో స్టులు, మిగులు టీచర్లు, సీనియారిటీ జాబితాలను ఆర్జేడీలకు సమర్పించాలని సూచించింది. 

అనంతరం ఆర్జేడీల ఆదేశాలను అనుసరించి మిగులు టీచర్లను అవసరమున్న స్కూళ్లలో కౌన్సెలింగ్ ద్వారా  ముందు భర్తీచేయాలి. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు డీఈవో లు  హైస్కూళ్లకు ఆర్జేడీలు ఈ ప్రక్రియను చేపట్టాలని నిర్దేశించింది. 

మిగులు టీచర్లను ముందు అదే మేనేజ్మెంటు స్కూలులోని ఖాళీ పోస్టుల్లో కౌన్సెలింగ్ ద్వారా నియమించాలని, అనంతరం ఇతర మేనేజ్మెంటు స్కూళ్లలో ఖాళీలుంటే తక్కిన మిగులు టీచర్లను వాటిలో నియమించాలని సూచించింది. 

అనంతరం ఇంకా ఏదైనా ఎయిడెడ్ స్కూలులో ఖాళీలుంటే ఆ జాబితాను డీఈవోలు ఆర్జేడీలకు అందించాలని తెలిపింది. ఈ ప్రక్రియ మొత్తాన్ని ఆగస్టు 31 నాటికి పూర్తిచేయాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు ఇచ్చింది.


Get Download Complete Information Click here


0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.