Thursday 1 July 2021

కొత్త టీడీఎస్ నిబంధనలు పెన్షనర్లకు ఊరట

కొత్త టీడీఎస్ నిబంధనలు పెన్షనర్లకు ఊరట టీడీఎస్ అంటే ఏమిటి? అమ్మకందారు పర్మనెంట్ అకౌంట్ నెంబర్ (పాన్)ను చెప్పకపోతే 5% టీడీఎస్

కొత్త టీడీఎస్ నిబంధనలు పెన్షనర్లకు ఊరట టీడీఎస్ అంటే ఏమిటి? అమ్మకందారు పర్మనెంట్ అకౌంట్ నెంబర్ (పాన్)ను చెప్పకపోతే 5% టీడీఎస్


కొత్త టీడీఎస్ నిబంధనలు పెన్షనర్లకు ఊరట


టీడీఎస్ చట్టం ప్రకారం నిర్దిష్ట పరిమితికి మించి ఏదైనా చెల్లింపు ఉన్నట్ల అది టీడీఎస్కు లోబడి ఉంటుంది. ఇలా ఒక వ్యక్తి మరో వ్యక్తికి చెల్లిస్తున్నప్పుడు ఆ మొత్తంలో టీడీఎస్ మినహాయిం చబడుతుంది. మిగిలిన మొత్తమే సదరు వ్యక్తికి చేరుతుంది.కొత్త మార్పులేమిటి?




వస్తువుల కొనుగోళ్లపై టీడీఎస్: ఆర్థిక సంవత్సరంలో రూ.50 లక్షలకుపైగా వస్తువులను కొన్నట్లైతే, వ్యాపారం లేదా వృత్తి ద్వారా రూ.10 కోట్లకు మించి టర్నోవర్ ఉన్నట్లైతే టీడీఎస్ చెల్లించాల్సిందే. అలాగే అమ్మకందారు పర్మనెంట్ అకౌంట్ నెంబర్ (పాన్)ను చెప్పకపోతే 5% టీడీఎస్.

పెన్షనర్లకు ఊరట: ఈ ఏప్రిల్ 1 నుంచే ఈ నిబంధన వర్తిస్తున్నది. 75 ఏండ్లు, ఆపై వయసువారికి ఐటీ రిటర్న్స్ దాఖలు నుంచి కొన్ని షరతులతో ఊరట కల్పిం చడమే దీని లక్ష్యం. అయితే గత సంవత్సరం రికార్డుపై సదరు సీనియర్ సిటిజన్ తప్పక రెసిడెంట్గా ఉండాలి. పెన్షన్ ఆదాయం పొందడానికి కేంద్రం పేర్కొన్న బ్యాంక్లో ఖాతానే కలిగి ఉండాలి. పెన్షన్ తప్ప ఏ రకమైన ఇతర ఆదాయాలు ఉండరాదు. దీనిపై బ్యాంకులకు పెన్షనర్లు డిక్లరేషన్ ఇస్తే.. బ్యాంకులే ను కోత పెడతాయి. దీంతో ఐటీఆర్ ఫైలింగ్ అవసరముండదు. టీడీఎస్


టీడీఎస్ లో ఏయే లావాదేవీలు?


నెలసరి వేతన చెల్లింపులు (టీడీఎస్ కేటగిరీలో ఉంటేనే)

ఎఫీలపై పొందే వడ్డీ ఆదాయం

రూ.30,000 దాటిన కాంట్రాక్ట్చెల్లింపులు

రూ.5,000 మించిన డివిడెండ్ ఆదాయం

రూ.30,000లకుపైగా ఉన్న ప్రొఫెష నల్, టెక్నికల్ సర్వీసెస్ ఫీజులు

రూ.50 లక్షలకుపైగా విలువైన భూమి లేదా భవనాల అమ్మకాలు అయితే ఆయా వ్యక్తులు, హిందూ అవి భాజ్య కుటుంబాలకు షరతులకు లోబడి పన్ను కోతల నుంచి నిర్దిష్ట మిన హాయింపులున్నాయి.


అధిక రేటులో టీడీఎస్: టీడీఎస్ పరిధిలో ఉన్నా.. రెండేండ్ల కుపైగా ఐటీఆర్ను దాఖలు చేయనివారిపై అధిక రేటులో టీడీఎస్ పడనున్నది.

న్యూఢిల్లీ, జూన్ 30: కొత్త టీడీఎస్ నిబంధనలు గురువారం (జూలై 1) నుంచి అమల్లోకి వస్తున్నాయి. ట్యాక్స్ డిడక్షన్స్ ఎట్ సోర్స్ (టీడీఎస్)కు సంబంధించిన నిబంధనలకు ఆర్థిక చట్టం 2021 పలు కీలక మార్పులను చేసింది. నయా టీసీఎస్ నిబంధనలూ వచ్చాయి.


0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.