Friday 16 July 2021

ఏ ఉద్యోగికీ అసంతృప్తి కలిగించం సీపీఎస్‌ రద్దు ఆచరణలో పెట్టేందుకు సీఎం ఆదేశాలు

ఏ ఉద్యోగికీ అసంతృప్తి కలిగించం సీపీఎస్‌ రద్దు ఆచరణలో పెట్టేందుకు సీఎం ఆదేశాలు - ఏపీఎన్జీవోల సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

ఏ ఉద్యోగికీ అసంతృప్తి కలిగించం సీపీఎస్‌ రద్దు ఆచరణలో పెట్టేందుకు సీఎం ఆదేశాలు - ఏపీఎన్జీవోల సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడి


ఏ ఉద్యోగికీ అసంతృప్తి కలిగించం సీపీఎస్‌ రద్దు ఆచరణలో పెట్టేందుకు సీఎం ఆదేశాలు 


ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై కుటుంబ పెద్దలా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఏ ఒక్క ఉద్యోగికీ అసంతృప్తి లేకుండా అన్ని సమస్యలను పరిష్కరిస్తారని చెప్పారు. ‘ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమేనని సీఎం జగన్‌ నమ్ముతున్నారు. గ్రూపు రాజకీయాలను ప్రోత్సహించరు. అట్టడుగున ఉన్న పేదలను నిలబెట్టడానికి సీఎం ప్రయత్నిస్తున్నారు. 
అలాంటిది కుటుంబంలో భాగమైన ఉద్యోగులను ఇబ్బంది పెట్టాలని ఎందుకు అనుకుంటారు’ అని పేర్కొన్నారు. తాడేపల్లిలో గురువారం ఏపీఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు నేతృత్వంలో సంఘం మాజీ అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి పదవీవిరమణ అభినందన సభ నిర్వహించారు. 

సజ్జలతో పాటు మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, వైకాపా నేతలు గౌతమ్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సజ్జల మాట్లాడుతూ ‘ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం వద్ద ఉన్న ప్రతిపాదనల్లో ఇబ్బందులుంటే పారదర్శకంగా చర్చిద్దాం. ఏ సమస్య లేనివి పరిష్కరించుకుంటూ పోదాం. 

ఉద్యోగులు అర్థం చేసుకుంటారు’ అనేది సీఎం జగన్‌ ఆలోచనగా పేర్కొన్నారు. ‘సీపీఎస్‌ను రద్దు చేసేందుకు ఆచరణలో ఏం చేయొచ్చో చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు. తప్పకుండా పరిష్కరిస్తారు. హామీలన్నింటినీ పూర్తిచేసి ఎన్నికలకు వెళ్లాలనేది సీఎం నిర్ణయం’ అని పేర్కొన్నారు. ‘ఉద్యోగులకు, ప్రభుత్వానికి మధ్య సమన్వయం చేసే బాధ్యతను చంద్రశేఖర్‌రెడ్డికి అప్పగిస్తాం. ఇందుకు కొత్తగా పోస్టు ఏర్పాటు చేస్తాం. జీవో త్వరలో విడుదలవుతుంది’ అని సజ్జల తెలిపారు.

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.