Monday 19 July 2021

ఉపాధ్యాయులకు అండగా నిలుస్తా - రాష్ట్ర మంత్రి పేర్ని నాని

ఉపాధ్యాయులకు అండగా నిలుస్తా - రాష్ట్ర మంత్రి పేర్ని నాని

ఉపాధ్యాయులకు అండగా నిలుస్తా - రాష్ట్ర మంత్రి పేర్ని నాని ప్యాఫ్తో రాష్ట్ర నూతన కార్యదర్శిగా ఎంపికైన చేబ్రోలు శరత్ చంద్రను సన్మానించిన మంత్రి


ఉపాధ్యాయులకు అండగా నిలుస్తా - రాష్ట్ర మంత్రి పేర్ని నాని


సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ పరంగా ఉపాధ్యాయులకు అండగా నిలుస్తానని రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) తెలిపారు. ప్యాఫ్తో రాష్ట్ర నూతన కార్యదర్శిగా ఎంపికైన చేబ్రోలు శరత్ చంద్రను బీటీఏ అసోసియేషన్ నాయకులతో కలసి ఆదివారం మచిలీపట్నంలో మంత్రి పేర్ని నానిని మర్యాద పూర్వకంగా కలిశారు. బందరు వాసి, ప్యాఫ్తోలో రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహరించటం మంచి పరిణామమని శరత్ చంద్రను మంత్రి అభినందించారు.




ఈ సందర్భంగా మంత్రి నాని మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తుందని చెప్పారు.

ఉద్యోగ, ఉపాధ్యాయులకు తప్పకుండా మేలు చేసేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఉపాధ్యాయులంతా అర్థం చేసుకోవాలని సూచించారు.

బీటీఏ జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు కందిమళ్ల శ్రీనివాసరావు, బట్టా రవికుమార్, గూడూరు మండల బాధ్యులు వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.