Saturday, 3 July 2021

టీచర్లు సంతృప్తి చెందితేనే కొత్త విద్యావిధానం

టీచర్లు సంతృప్తి చెందితేనే కొత్త విద్యావిధానం ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

టీచర్లు సంతృప్తి చెందితేనే కొత్త విద్యావిధానం ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి రాజకీయ అజెండాలో విద్య ఉండాలి మండలి ప్రొటెం ఛైర్మన్ బాలసుబ్రమణ్యం


టీచర్లు సంతృప్తి చెందితేనే కొత్త విద్యావిధానం


ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు సంతృప్తి చెందకుండా నూతన విద్యావిధానం అమల్లోకి వస్తుందని అనుకోవడం లేదని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
మండలిని, రాజకీయాలను సీఎం జగన్ వేర్వేరుగా చూస్తున్నారని చెప్పారు. అందువల్లే రాజ కీయాలకు అతీతంగా  ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రమణ్యాన్ని మండలి ప్రొటెం చైర్మన్ ఎన్నుకున్నారని తెలిపారు

శుక్రవారం తాడేపల్లిలో నిర్వహించిన బాలసుబ్రమణ్యం అభినందన సభలో సజ్జల మాట్లాడారు. 

విద్యారంగంలో సంస్కరణలు తెస్తున్నందున  ప్రతినిధులతో తరచూ మాట్లాడుతున్నా మన్నారు. 

రాజకీయ- సామాజిక అజెండాలో విద్య వస్తేనే భారతదేశ చరిత్ర మారుతుందని శాసనమండలి ప్రొటెం చైర్మన్ బాలసుబ్రమణ్యం అన్నారు. 

మీ పిల్లలకు మంచి చదువునందిస్తాం మాకు ఓట్లేయండి అనే రాజకీయం దేశంలో లేకపోవడమే విద్యావ్యవస్థ దుస్థితికి ప్రధాన కారణమన్నారు. కేరళ, ఆంధ్రప్రదేశ్లో మాత్రమే అద్భుతమైన పాఠశాల వ్యవస్థ ఉందన్నారు.

0 comments:

Post a Comment