Saturday 31 July 2021

టెన్త్ ఫలితాలు మరో వారం ఆలస్యం - మరో వారంలో పది ఫలితాలు

టెన్త్ ఫలితాలు మరో వారం ఆలస్యం - మరో వారంలో పది ఫలితాలు

టెన్త్ ఫలితాలు మరో వారం ఆలస్యం - మరో వారంలో ‘పది’ ఫలితాలు పాఠశాల విద్య డైరక్టరేట్లో పూర్తికాని కసరత్తు రాష్ట్రంలో పదో తరగతి పరీక్ష ఫలితాలు మరో వారం రోజులు ఆలస్యం కానున్నాయి


టెన్త్ ఫలితాలు మరో వారం ఆలస్యం - మరో వారంలో పది ఫలితాలు


అమరావతి: పదో తరగతి పరీక్షల ఫలితాలకు మరో వారం సమయం పట్ట  నుంది. అంతర్గత పరీక్షల మార్కుల వివరాల సేక రణలో జాప్యం జరగడంతో ఫలితాలు వెల్లడి ఆలస్యమవుతోంది. 




మార్కుల సేకరణ అనంతరం పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వ పరీక్షల విభాగానికి జాబితాను అందించాల్సి ఉంటుంది. అనంతరం ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది.


టెన్త్ ఫలితాలు మరో వారం ఆలస్యం


పాఠశాల విద్య డైరక్టరేట్లో పూర్తికాని కసరత్తు  అమరావతి రాష్ట్రంలో పదో తరగతి పరీక్ష ఫలితాలు మరో వారం రోజులు ఆలస్యం కానున్నాయి. విద్యార్థులకు నిర్వహించిన స్లిప్ టెస్ట్లు, ఎఫ్ఎ పరీక్షలకు వెయిటేజీ ఇచ్చి వాటి ఆధారంగా తుది మార్కులు ఇవ్వాలని ఛాయారతన్ కమిటీ చేసిన సిఫారసులను ప్రభుత్వం ఆమోదించింది.

మార్కులను క్రోడీకరించి వాటిని పాఠశాల విద్య డైరెక్టరేట్ నుంచి ప్రభుత్వ పరీక్షల విభాగానికి పంపించాలి. అయితే ఇంతవరకూ స్లిప్ టెస్టులు, ఎఫ్ఎ పరీక్షల మార్కులను పాఠశాల విద్యాశాఖ సిద్ధం చేయలేదు. దీనికి ఇంకో నాలుగు రోజులు పడుతుందని సమాచారం. 

అనంతరం ఆ మార్కులు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ వద్దకు చేరతాయి. వాటిని పరిశీలించి తుది ఫలితాలను ప్రకటించేందుకు మరో మూడు రోజులు పడుతుందని చెబుతున్నారు. దీనిబట్టి పదో తరగతి పరీక్షల ఫలితాలు మరో వారం తర్వాతే ప్రకటిస్తారని తెలుస్తోంది.

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.