Sunday 4 July 2021

తెలుగు రాష్టాల్లో భగ్గుమంటున్న పెట్రోల్ ధరలు

తెలుగు రాష్టాల్లో భగ్గుమంటున్న పెట్రోల్ ధరలు

తెలుగు రాష్టాల్లో భగ్గుమంటున్న  పెట్రోల్ ధరలు పలుచోట్ల  రూ 106 కు చేరిన పెట్రోల్


తెలుగు రాష్టాల్లో భగ్గుమంటున్న  పెట్రోల్ ధరలు


దేశంలో మునుపెన్నడూ లేని విధంగా ఇంధన ధరలు విపరీతగా పెరిగిపోతున్నాయి. డీజిల్‌ ధర కూడా పెట్రోల్‌తో పోటీ పడీ మరి పెరిగిపోతోంది. పెట్రోల్‌ సెంచరీ కొడుతుందా? అన్న చర్చ జరిగిన నేపథ్యంలోనే ఇప్పుడు ఏకంగా సెంచరీ దాటేసి మరీ దూసుకుపోతోంది. 




ఇక ఆంధ్రప్రదేశ్‌లోని పలు చోట్ల లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 106 దాటేసింది. దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఆదివారం ఇంధన ధరలు ఎలా ఉన్నాయో ఓ సారి చూద్దాం.

దేశరాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 99.51 గా ఉండగా, డీజిల్‌ రూ. 89.18 వద్ద కొనసాగుతోంది.

దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో పెట్రోల్‌ రూ. 105.58 కాగా, డీజిల్‌ రూ. 96.72 గా నమోదైంది.

తమిళనాడు రాజధాని చెన్నైలో లీటర్‌ పెట్రోల్‌ రూ.100.53, డీజిల్‌ రూ. 93.72గా ఉంది.

కర్ణాటక రాజధాని బెంగళూరులో పెట్రోల్‌ రూ. 102.84 , డీజిల్‌ రూ. 94.54 గా వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.

హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 103.41 వద్ద ఉండగా, డీజిల్‌ రూ. 97.20 గా నమోదైంది. విజయవాడలో లీటర్‌ పెట్రోల్ ధర ఏకంగా రూ.106.37కు చేరింది. ఇక డీజిల్‌ ధర రూ. 99.13 వద్ద కొనసాగుతోంది. విజయవాడతో పాటు కృష్ణ, గుంటూరులోనూ లీటర్‌ పెట్రోల్‌ రూ. 106 దాటేసింది.

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.