Tuesday 20 July 2021

CPS PARTIAL WITHDRAWAL పై విశ్లేషణ Partial Withdraw చేస్తే ఎంత వస్తుంది? PARTIAL WITHDRAWAL గురించి సందేహాలు - వివరణలు

CPS PARTIAL WITHDRAWAL పై విశ్లేషణ Partial Withdraw చేస్తే ఎంత వస్తుంది? PARTIAL WITHDRAWAL గురించి సందేహాలు - వివరణలు

CPS PARTIAL WITHDRAWAL పై విశ్లేషణ Partial Withdraw చేస్తే ఎంత వస్తుంది? PARTIAL WITHDRAWAL గురించి సందేహాలు - వివరణలు | CPS PARTIAL WITHDRAWAL పై విశ్లేషణ Partial Withdraw చేస్తే ఎంత వస్తుంది? మన CPS PRAN అకౌంట్ నుండి  PARTIAL WITHDRAWAL గురించి సందేహాలు - వివరణలు


CPS PARTIAL WITHDRAWAL పై విశ్లేషణ Partial Withdraw చేస్తే ఎంత వస్తుంది? PARTIAL WITHDRAWAL గురించి సందేహాలు - వివరణలు


మన సాలరీ నుంచి కట్ అయిన మొత్తములో 25% వాటా Example-A అనే ఎంప్లాయి సిపిఎస్ అకౌంట్లో పది లక్షల రూపాయలుఉన్నవిఅనుకుంటే ఇందులో రెండు లక్షలు cps  ఎర్నింగ్స్ అనుకో మిగతా 8 లక్షల లో  A అనే ఎంప్లాయి వాట నాలుగు లక్షలు ప్రభుత్వ వాటా నాలుగు లక్షలు.





A అనే ఎంప్లాయ్ వాటాలో 25% అంటే లక్ష రూపాయలు వరకు లేదా అంతకన్నా తక్కువ వరకు విత్డ్రా చేసుకోవచ్చు.( A అనే  ఎంప్లాయ్ వాటాలో 1% నుంచి మాక్సిమం 25% వరకు విత్ డ్రా చేసుకునే  అవకాశం ఉన్నది).



ప్రాన్ అకౌంట్ పాక్షిక ఉపసంహరణ సరళతరం 


అమరావతి, ఆంధ్రప్రభ: కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్లో కొనసాగుతున్న ఉద్యోగులు ఇకపై ప్రాన్ అకౌంట్ పాక్షిక ఉపసంహ రణకు ఎలాంటి డాక్యుమెంట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదని ట్రెజరీ శాఖ డైరెక్టర్ ఎన్. మోహన్ రావు సోమవారం విడుదల చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 1.86 లక్షల మంది ఉద్యోగులు తాము పీఎఫ్తార్డీఏలో దాచుకున్న సొమ్మును పాక్షికంగా ఉపసం హరించుకోవాలనుకునే ఉద్యోగులకు ఇకపై ఇబ్బందులు తొలగిపోతాయని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్య దర్శులు జి. హృదయరాజు, కె.వెంకటేశ్వర రావు తెలిపారు. ఈ ఉత్త ర్వుల మేరకు డాక్యుమెంట్లతో పని లేకుండా స్వీయ ధ్రువీకరణతోనే ఉపసంహరించుకునే అవకాశం ఏర్పడుతుందన్నారు.



సి పిఎస్ ఎంప్లాయిస్ విత్డ్రా చేసుకోవచ్చా!


1. ప్రభుత్వాలు  సిపిఎస్ రద్దు చేస్తాయి అని గట్టి నమ్మకం ఉంటే చేసుకోవచ్చు 

2. మనకు అత్యవసరంగా డబ్బులు అవసరం అయ్యి ,ఏదారి దొరకనప్పుడు ఎందుకంటే ఈ విత్డ్రా ఆప్షన్ ఎందుకు ఇచ్చారు అంటే సిపిఎస్ వ్యతిరేక ఉద్యమాలు దేశవ్యాప్తంగా జరుగుతున్న అందుకు, ఏదో సిపిఎస్ ఉద్యోగులకు మంచి చేస్తున్నట్టు ఇచ్చారు

Gpf వారికి జిపిఎఫ్ లో విత్డ్రా అవకాశం ఉంది కాబట్టి మనకు ఇచ్చారు.కానీ జిపిఎఫ్ వారికి ప్రభుత్వం పెన్షన్ ఇస్తుంది మన సి పి ఎస్ ఎంప్లాయిస్ కి మన పెట్టుబడే మన ఫెంక్షన్

మన  అమౌంట్( 10%+10%)షేర్ మార్కెట్ లో పెడుతున్నారు.

ఒకప్పుడు ఒక యూనిట్ షేర్ విలువ 12 రూపాయలు ఉండేది. ఇప్పుడు ఆ షేర్ విలువ దాదాపుగా 28 రూపాయల వరకు ఉంది

మన పెట్టుబడిని  ఉపసంహరణ ఇస్తే ఆ మేర earnings  కూడా తగ్గుతాయి

తక్కువ సర్వీస్ ఉన్నవారు విత్ డ్రా చేయవద్దు


మన CPS PRAN అకౌంట్ నుండి  PARTIAL WITHDRAWAL గురించి సందేహాలు - వివరణలు


Q1: బ్యాంక్ డీటైల్స్ అప్డేట్ ను ఇంటర్నెట్ లేదా ఆన్లైన్ లో చేసుకోవచ్చునా?

A: ఉద్యోగుల బ్యాంక్ డీటైల్స్ అప్డేట్  చేసుకోవడానికి ఆన్లైన్ ద్వారా అవకాశం లేదు. కేవలం S2 form నింపి DDO చే సంతకం చేయించి, దానికి బ్యాంక్ అకౌంట్ మొదటి పేజీ జీరాక్స్ జతచేసి STO ఆఫీస్ నందు ఇవ్వాలి.         

Q2) CPS ఉద్యోగులు Self declaration ద్వారా 25% పార్సియల్ withdraw చేసుకొనవచ్చునా?*   

A: CPS ఉద్యోగి 25% withdraw అనేది Self declaration చేసే అవకాశం ఇంకా రాష్ట్ర ఉద్యోగులకు లేదు. దీనికి సంబందించి ఎటువంటి ఉత్తర్వులు treasury అధికారులకు యివ్వలేదు.

Q3) ప్రస్తుతం 25% withdraw కి ఏ సందర్భం లో చేయగలరు?

A: ప్రస్తుతం CPS 25% withdraw చేయాలంటే supported document అనగా

1) Marriage purpose  లేదా

2) Home loan purpose లేదా

3) Higher education purpose of child or employee లేదా

4) Medical purpose కి సంబందించిన ఏదోఒక supported document ఉంటేనే 25% పాక్షిక ఉపసంహరణ అవకాశం ఉంది.

Q4) 25% withdraw time లో మన Pran account లోని మొత్తం సొమ్ములో 25% ని చెల్లిస్తారా?

A: 25% పాక్షిక ఉపసంహరణకు కేవలం employee contribution మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. 

ఉదా: ఒక cps ఉద్యోగి pran account లో contribution amount 7 లక్షలు & gained interest on cps amount 3 లక్షలు ,మొత్తం 10 లక్షలు ఉంటే దానిలో contribution amount 7 లక్షలలో state matching grant 3.5 lakhs మినహాయించగా మిగిలిన employee 3.5 lakhs లో 25% మాత్రమే పాక్షిక withdraw కి లెక్కిస్తారు. అనగా 87500 రూ"లు. ఇప్పటి వరకు employee contribute ద్వారా వచ్చిన వడ్డీని పాక్షిక withdraw కి లెక్కించడం లేదు.

Q5) partial withdraw కి తప్పకుండా నింపవలసిన ఫార్మ్స్ ఏవి?

A: 25% withdraw కొరకు 601pw form నింపవలెను

Q6) CPS ఉద్యోగి 25% withdraw చేయడం వలన భవిష్యత్ లో ఏమైనా సమస్య ఉందా?

A: ఎటువంటి సమస్యలేదు.

 Q7) రిటైర్ అయిన CPS ఉద్యోగి తన అకౌంట్ లో ఉన్న మిగిలిన 40% amount total నుండి 25% withdraw చేయవచ్చునా?

A: రిటైర్ అయిన cps ఉద్యోగులకు ఎటువంటి partial withdraw సదుపాయం లేదు.

Q8) 25% partial withdraw ద్వారా వచ్చిన అమౌంట్ ని ఆదాయపు పన్ను ( Income tax ) లో చూపించాలా?

A: Income tax కి చూపించనవసరం లేదు. ఇది గతంలో మనం వార్షిక returns లో చూపించిన saving amount ఇది

Q9) ఒకసారి partial withdrawal చేసిన తరువాత ఎన్ని సంవత్సరాల తరువాత చేయాలి?

A: 5 సంవత్సరాల తరువాత.

1 comment:

  1. Sir... Good information... Thanks

    Q.how many years services completion for Partial withdrawal ?10 or below eligible?

    ReplyDelete

Note: only a member of this blog may post a comment.