Saturday 7 August 2021

6-8-21 తేదీనాటి జగనన్న విద్యా కానుక మీధ జరిగిన WEBEX మీటింగ్ లోని మినుట్స్ ముఖ్యాంశాలు

6-8-21 తేదీనాటి జగనన్న విద్యా కానుక మీధ జరిగిన WEBEX మీటింగ్ లోని మినుట్స్ ముఖ్యాంశాలు

6-8-21 తేదీనాటి  జగనన్న విద్యా కానుక మీధ జరిగిన WEBEX మీటింగ్ లోని మినుట్స్ ముఖ్యాంశాలు | 6-8-21 తేదీనాటి ఎసిడి ఏ.పి.యస్.యస్ & పాఠాశాల విద్యా కమిషనర్ తో జగనన్న విద్యా కానుక మీధ WEBEX మీటింగ్ లో జరిగిన మినుట్స్ ముఖ్యాంశాలు


6-8-21 తేదీనాటి  జగనన్న విద్యా కానుక మీధ జరిగిన WEBEX మీటింగ్ లోని మినుట్స్ ముఖ్యాంశాలు


తేది. 6-08-2021 ఆంధ్ర ప్రదేశ్ సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు మరియు పాఠశాల విద్యాకమిషనర్ వారి అన్ని జిల్లాల జిల్లా విద్యాశాఖాధికారులు, అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ లు , మండల విద్యాశాఖాధికారులు, కమ్యూనిటి మొబలైజేషన్ అధికారులు మరియు అకడమిక్ మానిటరింగ్ అధికారులతో జగనన్న విద్యా కానుక మీధ WEBEX మీటింగ్ నిర్వహించడము జరిగినది.




6-8-21 తేదీనాటి ఎసిడి ఏ.పి.యస్.యస్ & పాఠాశాల విద్యా కమిషనర్ తో జగనన్న విద్యా కానుక మీధ WEBEX మీటింగ్ లో జరిగిన మినుట్స్ ముఖ్యాంశాలు


ఆంధ్ర ప్రదేశ్ సమగ శిక్షా రాష్ట్ర పదక సంచాలకులు వారి సూచనలు WEBEX మీటింగ్ ముఖ్యాంశాలు :


1.JVK APP ను డౌన్ లోడ్ చేసుకొని మండల కేంద్రాలకు వచ్చిన మెటీరియల్ వివరములను మండల విద్యాశాఖాధికారులు • స్కూల్ కాంప్లెక్స్ లకు చెరిఉన్న మేటరియల్ వివరములను స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు JVK APP నందు వెంటనే అప్లోడ్ చేయవలెను.

2. ఆంధ్ర ప్రదేశ్ సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు వారు మండల కేంద్రములకు వచ్చిఉన్న JVK

మెటీరియల్ (UNIFORMS, BAGS) స్కూల్ కాంప్లెక్స్ లకు పంపించవలెను స్కూల్ కాంప్లెక్స్ లకు చేరిఉన్న మెటీరియల్ ను పాఠశాల లకు పంపించవలెను.

3.పాఠశాల లో ఉపాద్యాయులు అందరి భాగస్వామ్యముతో తరగతి వారీగా, విద్యార్ధి వారిగా JVK KITS ను సిద్ధము చేయవలెను . 

4.మండల కేంద్రమునకు / స్కూల్ కాంప్లెక్స్ లకు చేరిన JVK Material చలానాపై మండల విద్యాశాఖాధికారి / SCHM సంతకము తో పాటుగా తేది ని కంపల్సరీగా నమోదు చేయవలెను.

5. మండల విద్యావనరుల కేంద్రము, స్కూల్ కాంప్లెక్స్ లలో తప్పనిసరిగా స్టాక్ నమోదు రిజిస్టర్

మరియు Stock Issue రిజిస్టర్ తప్పనిసరిగా మెయిన్ టైన్ చేయవలెను. 

6.JVK వస్తువుల పంపిణీ కి సంబంధించి వీడియో రూపొందించడము జరిగినది. దానిని అందరికి పంపడము జరుగును దానిలో సూచించిన విధముగా ఎలాంటి పొరపట్లకు తావులేకుండా కచ్చితత్వముతో మెటీరియల్ పంపిణీ జరగవలెను. 

7.JVK వస్తువులలో ఏమైనా డామేజ్ ఉన్నట్లైతే రిటన్ చేయవచ్చు.

8. ఆగష్టు 10 వ తేది లోపు JVK వస్తువులకు సంబంధించి పూర్తి సమాచారము ( Received, Distributed Balance, Requirement) రాష్ట్ర సమగ్ర శిక్షా కార్యాలయమునకు పంపవలెను


రాష్ట్ర పాఠశాల విద్యా కమిషనర్ వారి సూచనలు :


1. మండల కేంద్రమునుండి స్కూల్ కాంప్లెక్స్ లకు JVK Material పంపిణీ కి సంబందించి రూపొందించిన మోడల్ విడియోను అన్ని WATS APP గ్రూపులలో విస్తృత ప్రచారం నిర్వహించి వీడియో లో సూచించిన విదముగా మేటరీయల్ పంపిణీ చేయవలెను.

2. JVK వస్తువుల పంపిణీకి సంబంధించి బయో మెట్రిక్ authentication కొరకు ఆగష్టు 13 న నియోజక వర్గము / మండలం లలో ఒకొక్క పాఠశాలలో ట్రైల్ రన్ చేయాలి.

3. JVK వస్తువుల పంపిణీలో పాఠశాలలోని అందరూ ఉపాద్యాయులు భాగస్వామ్యము కావాలి ఎవ్వరికిని మినహాయింపు లేదు

4. ఆగష్టు 16 ప్రారంబించబడును గౌరవ ముఖ్యమంత్రి వర్యులవారు జగనన్న విద్యా కానుక లాంచనముగా

ఆగష్టు 16 నుండి ఆగష్టు 31 వరకు జగనన్న విద్యా కానుక పక్షోత్సవాలు నిర్వహించబడును ఈ రోజులలో పాఠశాలలో విద్యార్థులకు JVK kit లను పంపిణీ నిర్వహించవలెను 

5. పాఠశాలలోని ప్రతి ఉపాధ్యాయుడు 25 మంది పిల్లలకు బాధ్యతను వహించవలయును వారందరికి JVK kit లు సక్రమముగా అందేలా బాధ్యతను వహించవలయును.

జిల్లా లోని అందరూ మండల విద్యాశాఖాధికారులు, స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు, ఉపాద్యాయులు గౌరవ పాఠశాల విద్యా కమిషనర్ గారు మరియు సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు వారి సూచనలు పాటించి JVK కిట్స్ సక్రమంగా ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పంపిణీ చేయవలసినదిగా సూచించడమైనది.


Get Download Complete Guidelines Pdf File Click here


0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.