Thursday 5 August 2021

ఉద్యోగుల సర్వీసు నిబంధనల్లో సవరణ ఈబీసీ రిజర్వేషన్లకు అనుగుణంగా మార్పులు

ఉద్యోగుల సర్వీసు నిబంధనల్లో సవరణ ఈబీసీ రిజర్వేషన్లకు అనుగుణంగా మార్పులు

ఉద్యోగుల సర్వీసు నిబంధనల్లో సవరణ ఈబీసీ రిజర్వేషన్లకు అనుగుణంగా మార్పులు Ews రిజర్వేషన్ల రోస్టర్ పాయింట్స్


ఉద్యోగుల సర్వీసు నిబంధనల్లో సవరణ ఈబీసీ రిజర్వేషన్లకు అనుగుణంగా మార్పులు


ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఉద్యోగులకు సంబంధించిన సబార్డినేట్ సర్వీస్ నిబంధనల్లో సవరణలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. 




ఉద్యోగ నియామకాల్లో ఈబీసీ రిజర్వేషన్లకు రోస్టర్ పాయింట్లను ఖరారు చేస్తూ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ లో చేర్చారు.


Ews రిజర్వేషన్ల రోస్టర్ పాయింట్స్


ఇడబ్ల్యుఎస్ (ఆర్థికంగా వెనుబడిన తరగతులు) ఉద్యోగాల్లో రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం బుధవారం మార్గదర్శకాలు విడుదల చేసింది. 

స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 1996, రూల్ నెంబరు 22కు సవరణలు చేస్తూ ప్రభుత్వం జిఓ ఎంఎస్ నెంబరు 73ను విడుదల చేసింది. 18 ఏళ్ల వయసుకు లోబడి ఎవరైనా కుటుంబంలో ఇతరులపై ఆధారపడిన వారుంటే అటువంటి వారికి కూడా ఈ రిజర్వేషన్ వర్తించనుంది. 

10 శాతం ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం చట్టంలో కొన్ని మార్పులు తీసుకొచ్చారు.

మొత్తం రిజర్వేషన్లలో మహిళలకు 1/3 (33 1/3) ఉద్యోగాల్లో ఇడబ్ల్యుఎస్ కేటగిరి కింద ఇవ్వనున్నారు. ఇడబ్ల్యుఎస్ సర్టిఫికెట్స్ను తహశీల్దారు. జారీ చేయనున్నారు. రూ. 8 లక్షల ఆదాయం కలిగిన తరగతులు ఈ రిజర్వేషన్ పొందడానికి అర్హులుగా పేర్కొన్నారు.

రూల్ నెంబరు 22 సబ్  రూల్ (1) కింద మాజీ సైనికోద్యోగులు ఇడబ్ల్యుఎస్ రిజర్వేషన్లు పొందడానికి అర్హులే. నేరుగా నియామకాలు జరిగే ఉద్యోగాల్లో 100. ఖాళీలుంటే ఇందులో 

ఎస్సిలకు 15, 

ఎస్టిలకు 6, 

బిసిలకు 29, 

డబ్లుఎ కింద 10 ఉద్యోగాలను భర్తీ చేస్తారు. 

రోస్టర్ పాయింట్స్ 12,21,32,42,50, 61, 73, 82, 88, 96 కేటాయించారు. 

ఇందులో మహిళలకు 12, 50, 96 కేటాయించగా, 

ఓపెన్ కేటగిరిలో 21, 32, 42, 61, 73,82, 88 పాయింట్లను కేటాయించారు.


Get Download Complet Government Order copy GO.MS.No 73 Click here


0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.