Wednesday 16 June 2021

AP ఆన్‌లైన్ టీచింగ్ అవసరాన్ని కరోనా గుర్తు చేసింది కేవలం 1 నుండి 1.5 కిలో మీటర్ల కు మించి దూరం లేకుండా స్కూల్స్ ఏర్పాటు

AP ఆన్‌లైన్ టీచింగ్ అవసరాన్ని కరోనా గుర్తు చేసింది కేవలం 1 నుండి 1.5 కిలో మీటర్ల కు మించి దూరం లేకుండా స్కూల్స్ ఏర్పాటు

AP ఆన్‌లైన్ టీచింగ్ అవసరాన్ని కరోనా గుర్తు చేసింది త్వరలో కీలక నిర్ణయం కేవలం 1 నుండి 1.5 కిలో మీటర్ల కు మించి దూరం లేకుండా స్కూల్స్ ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తున్నాo - గౌ౹౹ ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు 


AP ఆన్‌లైన్ టీచింగ్ అవసరాన్ని కరోనా గుర్తు చేసింది కేవలం 1 నుండి 1.5 కిలో మీటర్ల కు మించి దూరం లేకుండా స్కూల్స్ ఏర్పాటు 


ఆన్‌లైన్ టీచింగ్ అవసరాన్ని కరోనా గర్తు చేసిందని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు  అన్నారు. వృత్తి విద్యా కోర్సులకు ఆన్లైన్ టీచింగ్ అందుబాటులో ఉందన్నారు.




నూతన విద్యా విధానం పై మంత్రి ఆదిమూలపు సురేష్‌ టీవీ9 తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఇక ఆన్ లైన్ టీచింగ్ పై ఉపాధ్యాయులకు ట్రైనింగ్ ఇవ్వాల్సి అవసరముందని అభిప్రాయ పడ్డారు.

జూలై చివరి వారంలో టెన్త్‌ పరీక్షలు నిర్వహించే అవకాశం - జూలై మొదటి వారంలో ఇంటర్‌ పరీక్షలు నిర్వహిస్తాం - మంత్రి ఆదిమూలపు సురేశ్‌

అంతే కాదు ఆన్ లైన్ క్లాసులను పిల్లలు గ్రహిస్తారా లేదా అనే అంశం పై కూడా కసరత్తు మొదలు పెట్టామన్నారు. ఆన్ లైన్ క్లాసులు నిర్వహణ పై ఇప్పటికే సర్వే నిర్వహించామన్నారు.

అమ్మ ఒడిలో భాగంగా దాదాపు 10 లక్షల మంది ల్యాప్ టాప్స్ కావాలని కోరారని ఇందుకు ముఖ్యమంత్రి గారు  సానుకూలంగా స్పందించారని తెలిపారు.

వారికి వెంటనే హై ఎండ్ ల్యాప్ టాప్స్ అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు  ఆదేశించినట్లుగా తెలిపారు. అయితే.. రాష్ట్రంలో 0.2 శాతం కంటే తక్కువ మందికి మాత్రమే ల్యాప్ టాప్స్ ఉన్నాయి.

2,193 మంది కొత్త టీచర్లు 2008 డీఎస్సీ బ్యాచ్ కు త్వరలో పోస్టింగులు

దాదాపు 25 శాతం మంది విద్యార్థులకు టీవీ కూడా అందుబాటులో లేదన్నారు. మౌలిక వసతులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందని.. ఈ అంశం పై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారిస్తుందన్నారు.

 ఇక స్కూల్ ఎక్కువ దూరం ఉంటే డ్రాప్ అవుట్స్ ఉండే అవకాశం ఉంటుందని.. ఇలాంటి పరిస్థితి రాకుండా కేవలం 1 నుండి 1.5 కిలో మీటర్ల కు మించి దూరం లేకుండా స్కూల్స్ ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తున్నామని అన్నారు.

విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ గారు  స్పష్టం చేశారు.

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.