Sunday 11 July 2021

రేపటి నుంచి ఆన్లైన్ లో పాఠాల బోధన 12వ తేదీ నుంచి ఆన్‌లైన్‌ తరగతులు సప్తగిరి ఛానల్‌ ద్వారా బోధన

రేపటి నుంచి ఆన్లైన్ లో పాఠాల బోధన ఈ నెల 12వ తేదీ నుంచి ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించాలని రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ నిర్ణయించింది. సప్తగిరి ఛానల్‌ ద్వారా పాఠాలు బోధించనున్నారు. వచ్చే నెలలో పాఠశాలలు ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది


రేపటి నుంచి ఆన్లైన్ లో పాఠాల బోధన 12వ తేదీ నుంచి ఆన్‌లైన్‌ తరగతులు సప్తగిరి ఛానల్‌ ద్వారా బోధన


ఈ నెల 5వ తేదీ నుంచి గుంటూరు జిల్లాలో 290, కృష్ణాలో 183 పాఠశాలల్లో ఆన్‌లైన్‌ తరగతులు మొదలయ్యాయి 7 నుంచి 10 తరగతుల విద్యార్థులకు ఉదయం 9:30 నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఉపాధ్యాయులు బోధిస్తున్నారు. జూమ్‌ యాప్‌ ద్వారా అభ్యసన ఎలా చేయాలనే అంశంపై అవగాహన కల్పించారు. పదో తరగతి విద్యార్థులు 50 శాతం మంది ఆన్‌లైన్‌ తరగతులకు హాజరవుతున్నారు.




7, 8 తరగతుల విద్యార్థులు 15 నుంచి 25 శాతం వరకు హాజరవుతున్నారు. స్మార్ట్‌ఫోన్లు లేకపోవడంతో అభ్యసనకు చాలా మంది దూరమవుతున్నారు.

సప్తగిరి ఛానల్‌ ద్వారా పాఠాలు బోధించనున్నారు. వచ్చే నెలలో పాఠశాలలు ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అప్పటివరకు పిల్లలు ఖాళీగా ఉండకుండా ఆన్‌లైన్‌ బోధనకు శ్రీకారం చుడుతున్నారు.

కొవిడ్‌ నేపథ్యంలో ప్రత్యక్ష తరగతులకు అవకాశం లేకపోవడంతో విద్యార్థులకు అందుబాటులో ఉన్న సాంకేతిక వనరులపై ఇటీవల ఉపాధ్యాయులు వివరాలు సేకరించారు 60 శాతం పైగా విద్యార్థుల వద్ద ఆన్‌లైన్‌ అభ్యసనకు అవసరమైన విద్యా సామగ్రి లేదనే విషయం స్పష్టమైంది

కొవిడ్‌తో ప్రత్యక్ష తరగతుల నిర్వహణకు అవకాశం లేకపోవడంతో ఈ నెల 12వ తేదీ నుంచి ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించాలని రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ నిర్ణయించింది. సప్తగిరి ఛానల్‌ ద్వారా పాఠాలు బోధించనున్నారు. వచ్చే నెలలో పాఠశాలలు ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అప్పటివరకు పిల్లలు ఖాళీగా ఉండకుండా ఆన్‌లైన్‌ బోధనకు శ్రీకారం చుడుతున్నారు

గుంటూరు జిల్లాలో 5,170 పాఠశాలలు ఉండగా 7.05 లక్షల మంది, కృష్ణాలో 4,821 పాఠశాలల్లో 6.76 లక్షల మంది ఒకటి నుంచి పదో తరగతి చదువుతున్నారు. డిజిటల్‌, వర్చువల్‌ తరగతులు 10 నుంచి 15 శాతం బడుల్లోనే అందుబాటులో ఉన్నాయి. మిగిలిన అన్ని బడుల్లోనూ ప్రత్యక్ష తరగతులు నిర్వహించాల్సిన పరిస్థితి. టీవీ, కంప్యూటర్‌, ల్యాప్‌టాప్‌, ట్యాబ్‌, సెల్‌ఫోన్‌ ద్వారా అభ్యసన చేసేందుకు ఆయా వనరులు పిల్లలకు పూర్తిస్థాయిలో అందుబాటులో లేవు

కొందరు ఉపాధ్యాయులు చొరవ తీసుకుని పాఠాలకు సంబంధించిన వీడియోలు విద్యార్థుల తల్లిదండ్రుల సెల్‌ఫోన్లకు పంపించి వాటిని చూసేలా చేయడంతో పాటు సందేహాలను నివృత్తి చేస్తున్నారు.


  • 12వ తేదీ నుంచి దూరదర్శన్‌ సప్తగిరి ఛానల్‌ ద్వారా ఉదయం 11 నుంచి 12 గంటల వరకు 
  • 1, 2 తరగతులు - ఉదయం 11 నుంచి 12 గంటల వరకు 
  • 3, 4, 5 తరగతులు - మధ్యాహ్నం 12 నుంచి ఒంటిగంట వరకు..
  • 6, 7 తరగతులు - మధ్యాహ్నం రెండు నుంచి మూడు వరకు
  • 8, 9 తరగతులు - మధ్యాహ్నం 3 నుంచి నాలుగు గంటల వరకు
  • 10 తరగతి విద్యార్థులకు - ఉదయం 10 నుంచి 11 గంటల వరకు భాషా తరగతులు
  • సాయంత్రం 4 నుంచి 5 వరకు భాషేతర శాస్త్రాల బోధన జరగనుంది.

ఆన్లైన్ తరగతులు కొవిడ్‌తో ప్రత్యక్ష తరగతుల నిర్వహణకు అవకాశం లేకపోవడంతో ఈ నెల 12వ తేదీ నుంచి ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించాలని రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ నిర్ణయించింది సప్తగిరి ఛానల్‌ ద్వారా పాఠాలు బోధించనున్నారు వచ్చే నెలలో పాఠశాలలు ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది.

చాలా రోజుల నుంచి బడులకు దూరమైన విద్యార్థులతో మళ్లీ పుస్తకాలు పట్టించే ప్రక్రియ ప్రారంభం కానుంది.

దీనికి సంబంధించి సన్నాహాలను గుంటూరు, కృష్ణా జిల్లాల విద్యాశాఖాధికారులు పూర్తి చేశారు. ప్రత్యక్ష పరోక్ష బోధనల్లో ఏది అవకాశం ఉంటే దాన్ని పూర్తిస్థాయిలో చేపట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు రెండు జిల్లాల డీఈవోలు గంగాభవానీ, తాహెరాసుల్తానా తెలిపారు.

ఈ నెల 12వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో పాఠాల బోధన అన్ని బడుల్లో ప్రారంభిస్తామని చెప్పారు.

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.