Friday 2 July 2021

టెన్త్, ఇంటర్ పరీక్షల ఫలితాలపై ఏపీ సర్కార్ కీలక ప్రకటన

టెన్త్, ఇంటర్ పరీక్షల ఫలితాలపై ఏపీ సర్కార్ కీలక ప్రకటన

టెన్త్, ఇంటర్ పరీక్షల ఫలితాలపై ఏపీ సర్కార్ కీలక ప్రకటన ఈనెలాఖరు లోపు విద్యార్థులకు ఫలితాలు


టెన్త్, ఇంటర్ పరీక్షల ఫలితాలపై ఏపీ సర్కార్ కీలక ప్రకటన


టెన్త్, ఇంటర్ పరీక్షల ఫలితాలపై ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక ప్రకటన చేశారు. టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు చేసిన నేపథ్యంలో హైపవర్ కమిటీ ఏర్పాటు చేశామని మూడు, నాలుగు రోజుల్లో కమిటీ నివేదిక ప్రభుత్వానికి వస్తుందన్నారు. 




కమిటీ సూచనలు మేరకు విద్యార్థులకు మార్కులు ప్రకటిస్తామని విద్యార్థుల భవిష్యత్ కి ఇబ్బందులు లేకుండా ఫలితాలు ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ఈనెలాఖరు లోపు విద్యార్థులకు ఫలితాలు ప్రకటిస్తామన్నారు

ఆగస్టులో సెట్ ఎగ్జామ్స్ యథాతదంగా జరుగుతాయని ఆగస్టు రెండో వారం కల్లా విద్యా సంవత్సరం ప్రారంభిస్తామని వెల్లడించారు. క్లాసులు నిర్వహించని నేపథ్యంలో 70 శాతం ఫీజులు తీసుకోవాలని ఆదేశించామని రెగ్యులరిటీ అండ్ మానిటరింగ్ కమిటీ ఈ సంవత్సరం ఫీజులు నిర్ణయిస్తుందని పేర్కొన్నారు

దాని ప్రకారం ప్రవేటు స్కూల్స్ లో ఫీజులు నిర్ణయిస్తామన్నారు కాగా ఇటీవలే టెన్త్, ఇంటర్ పరీక్షలను ఏపీ సర్కార్‌ రద్దు చేసిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవడవంతో ఏపీ సర్కార్‌ ఈ నిర్ణయం తీసుకుంది.

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.