Friday 13 August 2021

జగనన్న విద్యా కానుక 2021-22 - స్టూడెంట్ కిట్లు పంపిణీ కొరకు మరియు 'మన బడి నాడు-నేడు' మార్గదర్శకాలు

జగనన్న విద్యా కానుక 2021-22 - స్టూడెంట్ కిట్లు పంపిణీ కొరకు మరియు 'మన బడి నాడు-నేడు' మార్గదర్శకాలు

జగనన్న విద్యా కానుక 2021-22 - స్టూడెంట్ కిట్లు పంపిణీ కొరకు మరియు 'మన బడి నాడు-నేడు' మార్గదర్శకాలు ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ 'జగనన్న విద్యా కానుక' 2021-22 - స్టూడెంట్ కిట్లు పంపిణీ కొరకు మరియు 'మన బడి: నాడు-నేడు' - జిల్లా విద్యాశాఖాధికారులకు, సమగ్ర శిక్షా జిల్లా అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్లకు, సమగ్ర శిక్షా సీఎంవోలకు, మండల విద్యాశాఖాధికారులకు మరియు స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు మార్గదర్శకాలు ఆర్.సి. నెం. SS-16021/3/2021-CMO SEC - SSA


జగనన్న విద్యా కానుక 2021-22 - స్టూడెంట్ కిట్లు పంపిణీ కొరకు మరియు 'మన బడి నాడు-నేడు' మార్గదర్శకాలు


నిర్దేశాలు: 1 ) ఆర్.సి.నెం. SS-16021/3/2021-CMO SEC - SSA తేది: 07-06-2021 2) ఆర్.సి. నెం. SS-16021/3/2021-CMO SEC - SSA తేది: 05-08-2021




ఆదేశములు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలలో మౌలిక వసతులు మెరుగుపరచడమే ప్రధాన లక్ష్యంగా 'మన బడి:నాడు-నేడు' అనే ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ప్రారంభించింది. మొదటి దశలో 15,715 పాఠశాలల్లో రూ.3,669 కోట్లతో మౌలిక వసతులను మెరుగుపరచడం జరిగినది. మొదటి దశ పూర్తి అయిన సందర్భంగా దీనిని ప్రభుత్వం 2021 ఆగస్టు 16న ప్రజలకు అంకితం చేయనున్నారు. అలాగే అదేరోజు రెండవ దశలో భాగంగా 16.368 పాఠశాలల్లో రూ.4.535 కోట్లతో మౌలిక వసతులు మెరుగుపరిచే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అదే విధంగా ప్రభుత్వం వరుసగా రెండో ఏడాది నిర్వహిస్తున్న 'జగనన్న విద్యాకానుక' కార్యక్రమం అదే రోజు ప్రారంభించనున్నారు.

గత సంవత్సరం 'జగనన్న విద్యా కానుక'లో భాగంగా విద్యార్థులకు 3 జతల యూనిఫాం, నోటు పుస్తకాలు, ఒక జత బూట్లు మరియు రెండు జతల సాక్సులు, బెల్టు, బ్యాగు మరియు పాఠ్య పుస్తకాలు ఇవ్వడం జరిగింది. ఈ విద్యా సంవత్సరంలో అదనంగా 6 నుండి పదో తరగతి విద్యార్థులకు ఆక్స్ ఫర్డ్ డిక్షనరీ, 1 నుండి 5వ తరగతి విద్యార్థులకు పిక్టోరల్ డిక్షనరీల (బొమ్మల నిఘంటువు) ను అందించనున్నారు. దీనికోసం రూ. 731.30 కోట్లతో 47, 32, 064 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది.

'మన బడి: నాడు-నేడు' మొదటి దశ ముగింపులో భాగంగా, సంబంధిత జిల్లా కలెక్టర్లు ఉత్తమ సేవలందించిన ఇద్దరు హెడ్ మాస్టర్స్, ఇద్దరు ఇంజనీర్లు మరియు రెండు పేరెంట్స్ కమిటీలను గుర్తించి, వారికి తగిన విధంగా సన్మానించాలని అభ్యర్థించారు.


జగనన్న విద్యాకానుకలో భాగంగా పాటించవలసిన విషయాలు


'జగనన్న విద్యాకానుక" స్టూడెంట్ కిట్లును 16.08.2021 నుండి 31.08.2021 లోపు పంపిణీ చేయాలి. మొదట వచ్చిన విద్యార్థికి మొదట ప్రాధాన్యత ఇవ్వాలి.

రాష్ట్రంలోని అందరూ జిల్లా విద్యాశాఖాధికారులు, సమగ్రశిక్షా అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్లు ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రకటించే కోవిడ్ నియమనిబంధనలు పాటిస్తూ కార్యక్రమం సక్రమంగా అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలి

ఒక రోజులో గరిష్టంగా 30 - 40 మంది విద్యార్థులకు కిట్లు పంపిణీ చేయాలి ప్రతి పాఠశాల నందు 'స్టూడెంట్ కిట్" సిద్ధం చేసి విద్యార్థులకు అందించేందుకు సన్నద్ధులై ఉండాలి. ఏ తరగతి విద్యార్థికి

ఏయే వస్తువులు బ్యాగులో వేసి సిద్ధం చేయాలో 'అనుబంధం-1'లో పొందుపరచడమైనది. తరగతి వారీగా బాలబాలికలకు విడివిడిగా కిట్లు సిద్ధం చేసుకుని ఉండాలి. సులభంగా, త్వరితగతిన సంబంధిత విద్యార్థికి కిట్ అందించడానికి ప్రతి బ్యాగు మీద ఉన్న పౌచ్ లో దిగువ తెలిపినట్లు పేపర్ పెట్టుకోవాలి. 


నమూనా:


  • పాఠశాల పేరు
  • విద్యార్థి పేరు:
  • తరగతి:


కిట్ లో ఉన్న వస్తువులు (ఉన్నవి 'టిక్' పెట్టాలి)


  • పాఠ్య పుస్తకాలు
  • బెల్టు
  • 3 జతల యూనిఫాం క్లాత్
  • నోటు పుస్తకాలు/ వర్క్ బుక్స్
  • ఒక జత బూట్లు & 2 జతల సాక్సులు


అందుకున్న వివిధ సరుకులకు సంబంధించిన వివరాలను స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు అందించబడిన వారి లాగిన్ నందు నమోదు చేయవలసి ఉంటుంది. జగనన్న విద్యాకానుక కార్యక్రమాన్ని నిర్వహించడానికి 16.08.2021 న మన బడి: నాడు నేడు' పనులు పూర్తయిన పాఠశాలల్లో జిల్లా కేంద్రం నందు ఒక పాఠశాలను, ప్రతి నియోజకవర్గం నందు ఒకటి, ఇవికాకుండా మిగిలిన మండలాల్లో ఒక్కో పాఠశాలను ఎంపిక చేసుకోవాలి.

01.09.2021 నాటి నుండి కొత్త ప్రవేశాలు (అడ్మిషన్లు) వివరాలు, అందిన సరుకునందు ఏమైనా చినిగినా, పాడైనా, బూట్లు మిస్ మ్యాచ్ వంటివి ఉన్నా పాఠశాలనందు. ఆ వివరాలను నమోదు చేసి సంబంధిత మండల విద్యాశాఖాధికారి వారికి, సదరు మండల విద్యాశాఖాధికారి సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి లేదా సమగ్రశిక్షా అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్ వారికి లేదా జిల్లా సీఎంవోకు తెలియపరచాలి.

జిల్లా కేంద్రం నుండి డిక్షనరీలు తరలించడానికి ట్రాన్స్ పోర్టరును ఎంపిక చేయడానికి, ట్రాన్స్పోర్టేషన్ కు అయ్యే ఖర్చు చెల్లించడానికి జిల్లా కలెక్టర్ గారి నేతృత్వం లో జిల్లా డీపీసీ ఆమోదం తీసుకుని సంబంధిత జిల్లా డీపీవో మేనేజ్ మెంట్ కాస్ట్ నుండి చెల్లించాలి. మండల కేంద్రాల నుండి స్కూల్ కాంప్లెక్సులకు, అక్కడి నుండి పాఠశాలలకు సరుకు సరఫరా చేయడానికి అయ్యే ఖర్చును కూడా జిల్లా డీపీసీ వారి ఆమోదంతో తగిన బిల్లులు సమర్పించిన తరువాత జిల్లా డీపీవో మేనేజ్ మెంట్ కాస్ట్ నుండి చెల్లించాలి.

జిల్లా నందు సేకరించిన పూర్తి సమాచారం సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి లేదా సమగ్రశిక్షా అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్ లేదా జిల్లా సీఎంవో రాష్ట్ర కార్యాలయానికి 15,09.2021 నాటికి తెలియజేయాలి. ఆ తర్వాత వచ్చిన ఫిర్యాదులు స్వీకరించబడవు.

'జగనన్న విద్యాకానుక' స్టూడెంట్ కిట్లును సరఫరా చేసేటప్పుడు సరుకులో ఏమైనా నాణ్యతా లోపాలు గుర్తించినట్లయితే వాటిని సరఫరా చేయకుండా ఆ సరుకును రిజక్ట్ చేసి ఆ వివరాలను స్టాకు రిజిస్టర్ నందు నమోదు చేయాలి.

రాష్ట్ర కార్యాలయం నందుగల రాష్ట్ర అకడమిక్ మోనటరింగ్ ఆఫీసర్ వారిని 'జగనన్న విద్యాకానుక గ్రీవెన్స్ సెల్ నోడల్: ఆఫీసరుగా నియమించడమైనది. జిల్లా నుంచి ఫిర్యాదులు jvk2grievance@gmail.com కు పంపించాలి. 0866 - 2428599 నంబరును సంప్రదించవచ్చు.

జిల్లా నందు ఈ ఫిర్యాదులు సేకరించుటకు ఏఎంవోలకు బాధ్యతలు అప్పగించడమైనది. ప్రతి జిల్లా నందు ఈ ఫిర్యాదులు సేకరించుటకు ఒక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి ఏఎంవో దానిని పర్యవేక్షించాలి. ప్రతి జిల్లాలో ఫిర్యాదులు కోసం ఒక ఫోన్ number ఏర్పాటు చేయాలి. అందిన ఫిర్యాదులను 15.09.2021 లోపల రాష్ట్ర కార్యాలయానికి సమర్పించాలి. కిట్కు సంబంధించిన వస్తువులు అందినవి అందినట్లు స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో ఉపాధ్యాయులు, సిబ్బంది. సహకారంతో ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖాధికారులు, కమ్యూనిటీ మొబిలైజేషన్ అధికారులు నమోదు.

చేసిన వివరాలను (ఎన్ని వచ్చాయి? ఇంకా ఎన్ని అండాలి?) ఎప్పటికప్పుడు జిల్లా అధికారులు గమనిస్తూ ఉండాలి.

జగనన్న విద్యాకానుక స్టూడెంట్ కిట్లు జిల్లాకు సరిపడినన్ని రానిపక్షంలో ఏ సరుకు ఎంత కావాలో సంబంధిత అధికారుల ద్వారా రాష్ట్ర కార్యాలయానికి తెలియజేయాలి.

'జగనన్న విద్యాకానుక' వస్తువుల పంపిణీలో ఏవైనా సందేహాలు ఉన్న యెడల 91542 94169 నంబరులో కార్యాలయపు పనివేళ్లలో సంప్రదించగలరు. మండల విద్యాశాఖాధికారులు మరియు స్కూల్ కాంప్లెక్సు ప్రధానోపాధ్యాయులు జగనన్న విద్యాకానుక' యాప్ లో తమకిచ్చిన లాగిన్ నందు అందుకున్న వస్తువుల వివరాలు ఎప్పటికప్పుడు తప్పనిసరిగా నమోదు చేయాలి.

పూర్తి శ్రద్ధతో పై ఆదేశాలను అత్యంత జాగరూకతతో అమలు చేయవలసిందిగా ఇందుమూలంగా ఆదేశించడమైనది.

దీనితో పాటు 'అనుబంధం-1' జతపరచడమైనది.


Get Download Complete Guidelines Click here

Get Download Jvk Kit Distributon User Mannual Click here

Jagananna Vidya Kanuka JVK Updated Android App Version 2.0

జగనన్న విద్యా కానుక 2021-22 - స్టూడెంట్ కిట్లు పంపిణీ కొరకు మరియు 'మన బడి నాడు-నేడు' మార్గదర్శకాలు

జగనన్న విద్యకానుక షూ పంపిణీ కార్యక్రమం లో తరగతుల వారీగా విద్యార్థులకు ఇచ్చు షూ కొలతలు

JVK ACQUITTANCE Check list form New Text Books and Work Books Receiving and Distribution Model Acquaintance Form 

Jagananna Vidya Kanuka 2021-22 JVK - 2 Material Received  Details Submitted Link Enable at CSE Website

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.