Tuesday 10 August 2021

జగనన్న విద్యాకానుక విద్యార్థులకు అందజేయుటలో కాంప్లెక్స్ మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులకు సూచనలు

జగనన్న విద్యాకానుక విద్యార్థులకు అందజేయుటలో కాంప్లెక్స్ మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులకు సూచనలు

జగనన్న విద్యాకానుక విద్యార్థులకు అందజేయుటలో కాంప్లెక్స్ మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులకు సూచనలు జగనన్న విద్యాకానుక పంపిణీ ప్రక్రియ విద్యార్థులకు అందజేయుటలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులకు సూచనలు


జగనన్న విద్యాకానుక విద్యార్థులకు అందజేయుటలో కాంప్లెక్స్ మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులకు సూచనలు


మండల కేంద్రం నుండి కాంప్లెక్స్ సముదాయాలకు మరియు కాంప్లెక్స్ సముదాయాల నుండి పాఠశాల సముదాయాలకు తీసుకున్న జగనన్న విద్యా కానుక వస్తువులను వెంటనే ఆ సంచులను పైన ఉన్న సైజులవారీగా మరియు బాలికలకు, బాలురకు విడివిడిగా పెట్టు కొనుటకు, అలాగే తీసుకున్న వస్తువులను భద్రపరచుటకు, మరియు వర్షపు నీరు చేరకుండా ఉండే విధంగా ఒక విశాలమైన గది ఒకటి పాఠశాలలో ఏర్పాటు చేసుకుని తగు జాగ్రత్తలు తీసుకోవాలి.





ముందుగా కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు వారి సముదాయాలకు వచ్చిన విద్యాకానుక వస్తువులను సప్లయిర్ మరియు మండల కేంద్రం వారు ఇచ్చిన Acknowledgement ప్రకారం అన్ని సరిచూసుకుని రాని వస్తువులను నోట్ చేసుకోవాలి.


విద్యాకానుక పంపిణీ ప్రక్రియ:


1. కాంప్లెక్స్ పాఠశాల సముదాయంలో విద్యాకానుక పంపిణీ చేయడానికి రెండురోజులముందుగా కాంప్లెక్స్ పరిధిలోని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సమాచారం అందించి, CSE Site లో నమోదు చేసిన విద్యార్థుల వివరాలు మరియు విద్యార్ధుల బూట్ల సైజులు బాలురువి, బాలికలవి విడివిడిగా సిద్ధం చేసుకుని ఉండవలెనని సూచించవలెను. అలాగే విద్యకానుక వస్తువలను తీసుకువెళ్ళటానికి తగిన ఏర్పాట్లు చేసుకోవలెనని, మరియు బాలబాలికల బూట్లను మరియు ఇతర విద్యాకానుక వస్తువులను విడివిడిగా పెట్టుకొనుటకు విద్యార్థుల సంఖ్యను బట్టి గొనెసంచులను తప్పనిసరిగా తెచ్చుకోనుటకు తగు సూచనలు చేయవలెను.

2.కాంప్లెక్స్ స్థాయిలో ఒకరోజు ముందుగా సైజులవారిగా మరియు బాలికలకు, బాలురకు విడివిడిగా బూట్లు, సాక్సులు, బ్యాగులు, బెల్టులు, పుస్తకాలు, టేబుళ్లు పై ఏర్పాటు చేయుటకు సిద్ధపరచ వలెను, అలాగే ప్రదర్శన బోర్డు, మార్కరు, పూరి కొసలు, చిన్నచిన్న పాలిథిన్ కవర్లు, పిన్నులమిషన్, సైజులను ప్రదర్శించుటకు అనువుగా పేపరుపై ప్రింటులు తీసి టేబుళ్లకు అతికించవలెను.

3. కాంప్లెక్స్ ప్రధానోపధ్యాయులు కాంప్లెక్స్ సి.ఆర్.పి. మరియు మీ పాఠశాలలోని ఉపాధ్యాయులను మరియు కాంప్లెక్స్ పరిధిలోని ప్రాధమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయుల సహకారం తీసుకుని, తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఏర్పాట్లు చేయవలెను.

4.ప్రధానోపాధ్యాయులు రాగానే వారి వద్ద నుంచి విద్యార్థుల వివరాలు, మరియు బూట్ల వివరాలు తీసుకుని మనవద్ద ఉన్న వివరాలతో సరిచూసుకొని వారికి కావలసిన వస్తువులు తీసుకొనుటకు ముందుగా ఏర్పాటు చేసిన కౌంటర్లకు పంపవలెను.

5. ప్రతి కౌంటర్లలో విద్యార్థుల బూట్ల సైజులకు సరిపడ సాక్సులను కవర్లలో ఉంచి దానిపై బూట్ల సైజును రాసి పిన్ చేసి ఉంచవలెను. ప్రధానోపాధ్యాయులు వాటిని ఒకసారి సరిచూసుకుని తీసుకొనవలెను.

6. ప్రధానోపాధ్యాయులు వారు తెచ్చుకున్న గొనెసంచిపై వారి పాఠశాల పేరు, బాలికలు లేదా బాలురు అని రాసి సైజుల వారిగా విధ్యకానుక వస్తువులను సంచులలో వేసి, అలాగే బూట్లకు సంభందించి మాత్రం ప్రత్యేకంగా విడివిడిగా కవర్లలో వేసి వాటిపై సైజులు మరియు బాలికలకు/ బాలురకు అని రాసి గోనె సంచీ లో వేసుకోవలెను.

7. ఈ విధంగా అన్ని సైజు బ్లూట్లు మరియు విద్యాకానుక వస్తువులను తీసుకున్న తర్వాత ఆ గోనె సంచిని పురికొసతో కట్టి ఆ సంచులను ప్రక్కన పెట్టి రిజిష్టర్లో అందిన విద్యాకానుక వస్తువులను విధిగా సరిచూసుకుని అందితే అందినట్లు లేని యెడల అందనట్లు యక్విటేన్స్ పై సంతకం చేయవలెను మీకు ఇంకా కొన్ని వస్తువులు రానియెడల లేదా సరిపడా సైజు లేనియెడల ఆ వివరాలను రిజిష్టర్లో నమోదు చేయవలెను.


జగనన్న విద్యాకానుక కిట్ల పంపిణీకి పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సూచనలు


8. ప్రాధమిక, ప్రాథమికొన్నత, మరియు ఉన్నత పాఠశాలల ప్రదానోపాధ్యాయులు పైన తెలిపిన విధముగా మీ పాఠశాలలకు తీసుకుని వచ్చిన వస్తువులను భద్రపరచి, అదే విధంగా పంపిణీ చేయు తేదినాటికి మీ పాఠశాలలలోని ఉపాధ్యాయుల సహకారంతో తరగతుల వారీగా విద్యాకానుక కిట్లను సంసిద్ధము. చేయవలెను.

9. ప్రధానోపాధ్యాయులు జగనన్న విద్యాకానుక కిట్లు పంపిణీ తేదీ, సమయం తల్లిదండ్రులకు ఒకరోజు ముందుగా సమాచారం అందించ వలెను. విద్యాకానుక పంపిణీ చేయుగది బయట ఆవరణలో తల్లిదండ్రుల కొరకు విద్యాకానుక సంభందించిన ప్రతి వస్తువులలో ఒక్క నమూనాని మరియు వాటి వివరాలను (వస్తువుల వారిగా ప్రదర్శించవలెను,

10. అదే విధంగా తీసుకున్న విద్యాకానుకలోని ప్రతి వస్తువును అక్కడే సరిచూసుకునే విధంగా

11. తల్లిదండ్రులకు తగు సూచనలు చేయవలెను. అదే విధంగా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తీసుకున్న. వస్తువులకు యక్విటేన్సు తీసుకోవలెను మరియు బయోమెట్రిక్ వేయించవలెను.

విద్యాకాసుక కిట్లలో ఉన్న వస్తువులలో ఏదైన నాణ్యతకు సంబంధించి లోపాలు ఉన్న ఎడల ఫిర్యాదులను స్వీకరించడానికి ఒక కౌంటరును తప్పనిసరిగా ఏర్పాటు చేయవలెను. ఏమైనా వస్తువులు గురించి ఫిర్యాదులు అందిన యెడల, వెంటనే పాఠశాలలో ఉన్న వస్తువులతో గాని కాంప్లెక్స్ సముదాయములో ఉన్న వస్తువులతో గాని మార్పు చేసి ఇవ్వవలెను. ఒక వేల వస్తువులు ఎక్కడ సరిపడా లేనియెడల మండల కేంద్రానికి వెంటనే తెలుపవలెను.

తల్లి దండ్రులు మరియు ఉపాధ్యాయులు కోవిడ్ నిభంధనలను అనుసరించి తగు జాగ్రత్తలు తీసుకోవలెను


Get Download Complete Information Click here

Jagananna Vidya Kanuka JVK Updated Android App Version 2.0

Get Download Jvk Kit Distributon User Mannual Click here

జగనన్న విద్యా కానుక 2021-22 - స్టూడెంట్ కిట్లు పంపిణీ కొరకు మరియు 'మన బడి నాడు-నేడు' మార్గదర్శకాలు

జగనన్న విద్యకానుక షూ పంపిణీ కార్యక్రమం లో తరగతుల వారీగా విద్యార్థులకు ఇచ్చు షూ కొలతలు 

JVK ACQUITTANCE Check list form New Text Books and Work Books Receiving and Distribution Model Acquaintance Form 

Jagananna Vidya Kanuka Guidelines for  Supply of Uniform Cloth - Shoes & Socks and Bags from Mandal Resource Centers to School Complexes H.Ms

Jagananna Vidya Kanuka 2021-22 JVK - 2 Material Received  Details Submitted Link Enable at CSE Website

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.